mt_logo

రాష్ట్రాన్ని సంక్షేమానికి చిరునామాగా మలిచిన తెలంగాణ సృష్టి కర్త

  • 2014 లో ఆసరా కింద నెలకు ఇచ్చిన పెన్షన్ మొత్తం రూ.67 .47 కోట్లు మాత్రమే. నేడు నెలకు రూ.976.42 కోట్ల ఆసరా కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
  • 5 లక్షల 11 వేల 656 మంది దివ్యాంగులకు లబ్ధి

హైదరాబాద్, జూలై 26: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమాజంలోని అత్యంత బలహీన వర్గాలను ఆదుకునేందుకు , పెరుగుతున్న వయస్సుతో జీవనోపాధిని కోల్పోయిన వారు గౌరవప్రదంగా సామాజిక భద్రత తో కూడిన జీవితాన్ని గడుపుటకు రోజు వారీ కనీస అవసరాలకు ఆర్థిక మద్దతు అందించుటకు 2014 నవంబర్ లో ఆసరా పెన్షన్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రారంభంలో వృద్ధులు, దివ్యాంగులు, హెచ్ ఐ వి – ఎయిడ్స్ బాధితులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులకు ఆసరా పెన్షన్ లను తెలంగాణ ప్రభుత్వం అందజేసింది. తదుపరి బీడీ కార్మికులకు మార్చి 2015  నుండి ఒంటరి మహిళలకు ఏప్రిల్ 2017 నుండి, ఫైలేరియా ప్రభావిత వ్యక్తులకు  ఏప్రిల్ 2018 నుండి , డయాలసిస్ బాధితులకు ఆగస్టు 2022 ఆసరా పెన్షన్ పథకాన్ని ప్రభుత్వం వర్తింప జేసింది. బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఆసరా పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే . అలాగే వృద్ధాప్య పెన్షన్ పొందే అర్హత వయస్సును 65 నుండి 57 సంవత్సరాలకు  ప్రభుత్వం తగ్గించింది. దీంతో కొత్త వృద్ధాప్య పెన్షన్ లతో పాటు వివిధ కేటగిరీల కు చెందిన 10 లక్షల లబ్దిదారులకు కొత్తగా ఆసరా పెన్షన్లు మంజూరు చేయుటకు ఆగస్టు 2022 లో ప్రభుత్వం ఆమోదించింది.

ఆసరా పెన్షన్ ల కింద వివిధ కేటగిరీల కింద తెలంగాణ ప్రభుత్వం నెలకు రూ.976 కోట్ల 42 లక్షల ఆర్థిక భరోసా గా అందజేస్తున్నది. దేశంలో ఆర్థిక భరోసా అవసరమైన ప్రతి ఇంటికి ప్రభుత్వం అండగా నిలుస్తున్న ది. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారుల సంఖ్య 28,47,855 మాత్రమే. 2023 జూన్ నాటికి ఆసరా పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య 43,81,338 లకు చేరింది. భారంగా కాలం గడుపుతున్న వివిధ వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించుటకు ప్రభుత్వం మానవీయ కోణంలో వ్యవహరించింది.  నెలవారీగా ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని కూడా దశల వారీగా గణనీయంగా పెంచింది. గతంలో వృద్ధులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులకు నెలకు రూ.200 చొప్పున ప్రభుత్వం పెన్షన్ ఇచ్చేది. దివ్యాంగులకు రూ.500 పెన్షన్ ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నెలవారీ ఇస్తున్న పెన్షన్లు ను రూ.2016 కు, దివ్యాంగులకు రూ.3016 కు ప్రభుత్వం పెంచింది. అలాగే బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, బోదకాలు, డయాలసిస్ బాధితులకు రూ.2016 చొప్పున ప్రభుత్వం ఆసరా పెన్షన్ ఇస్తున్నది. అర్హులైన వారికి పెన్షన్ మంజూరు చేయడం వల్ల 2014 తో పోల్చితే లబ్ధిదారుల సంఖ్య అదనంగా 15,33,483 పెరిగి మొత్తం ఆసరా పెన్షన్ లబ్ది దారుల సంఖ్య 43,81,338 కు చేరింది. అలాగే 2014 లో పెన్షన్లు కింద నెలకు ఇచ్చిన మొత్తం రూ.67.47 కోట్లు మాత్రమే ఉండేది. నేడు అది రూ 976.42 కోట్లకు చేరింది. ఆసరా పెన్షన్ ల కింద 2014 నుంచి 2022 -23 వరకు తెలంగాణ ప్రభుత్వం రూ.58,696 కోట్ల 25 లక్షలను ఆర్థిక భరోసా గా అందజేసింది. ఇప్పుడు దివ్యంగులకు పెంచిన ఆసరాతో  వార్షికంగా ఆసరా కింద ఇచ్చే పెన్షన్ మొత్తం 11712 కోట్ల 24 లక్షలకు చేరుతుంది.  2014 తో పోల్చితే ఆసరా పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. 

దివ్యాంగుల పెన్షన్ ను రూ.4016 కు పెంచిన తెలంగాణ ప్రభుత్వం

ఆసరా అవసరమైన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ‌ వెల్లడించారు. దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భరోసాను కల్పిస్తూ వారి పింఛన్‌ను రూ.3016 నుంచి రూ.4016కు  ప్రభుత్వం  పెంచింది.పింఛన్‌ పెంపువల్ల రాష్ట్రంలోని దివ్యాంగులకు నెలకు రూ.205 కోట్ల 48 లక్షల ఆర్థిక ఆసరా లభించనున్నాయని వివరించారు. తెలంగాణ రాకముందు కేవలం 3 లక్షల 57 వేల మంది దివ్యాంగులకు నెలకు 500 చొప్పున మాత్రమే కేవలం 17 కోట్లు మాత్రమే అందేవని, స్వయంపాలనలో అర్హులైన దివ్యాంగులను గుర్తించేందుకు చర్యలు చేపట్టామని, తద్వారా వారి సంఖ్య 5 లక్షల 11 వేల 656 కు పెరిగిందని వివరించారు.

దేశానికే ఆదర్శం: రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి & గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

మానవీయకోణంలో కొనసాగుతున్న సీఎం కేసీఆర్‌ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న ది.

దివ్యాంగుల పింఛన్‌ పెంపుపై హర్షం వ్యక్తం అవుతున్నది. తెలంగాణ రాష్ట్రం మరో చారిత్రక ఘట్టానికి వేదికగా నిలిచింది. అభాగ్యులైన, ఆసరా అవసరమైన దివ్యాంగులకు నేనున్నానంటూ ఆర్థిక భరోసాగా అందిస్తున్న మొత్తాన్ని మరింతగా పెంచింది. దివ్యాంగులు ఇక మీదట రూ. 4,016 అత్యధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న ది.

వివిధ రాష్ట్రాల్లో దివ్యాంగులకు నెలవారీ ఇస్తున్న పింఛన్లు (రూ.లో)

కర్ణాటక : 1,100

రాజస్థాన్‌ : 750

ఛత్తీస్‌గఢ్‌: 500

ఉత్తర్‌ప్రదేశ్‌  : 1,000

మహారాష్ట్ర : 300

మధ్యప్రదేశ్‌  : 300

ఆంధ్రప్రదేశ్‌: 3,000

బీహార్‌ : 500

మిజోరం: 100

ఒడిశా: 200

జార్ఖండ్‌  : 700

తమిళనాడు: 1,000

కేరళ  : 1,300

అభాగ్యులైన ఆసరా అవసరమైన దివ్యాంగులకు నేనున్నానంటూ ఆర్థిక భరోసా కల్పిస్తూ దివ్యాంగులకు ఇప్పటివరకు ఇస్తున్న నెలవారీ ఇస్తున్న పెన్షన్ లను  తెలంగాణ ప్రభుత్వం భారీగా పెంచింది. రూ 3016 లు వున్న దివ్యాంగ పెన్షన్లు ఈ జూలై నెల నుంచే రూ.4016  లకు పెంచింది. దేశంలో ఏ రాష్ట్రం లో ఇంత మొత్తంలో పెన్షన్ ఇవ్వడం లేదు. దివ్యాంగుల సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది.