mt_logo

ఘనంగా “ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ మూవ్‌మెంట్స్” పుస్తక ఆవిష్కరణ

– స్వచ్చ రాజకీయాలకు ఎన్.ఆర్.ఐ లు ముందుకు రావాలి – వి.ప్రకాశ్

వాషింగ్టన్ రాష్ట్రం లోని సియాటెల్ నగరంలో వి. ప్రకాశ్ రచించిన “ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ మూవ్‌మెంట్స్” అనే పుస్తకం విడుదల ఘనంగా జరిగింది. వాటా, వాట్ జి మరియు ఎన్.ఆర్.ఐ టీ.ఆర్.ఎస్ (సియాటెల్) ఆధ్వర్యంలో జరిగిన ఈ పుస్తక విడుదల కార్యక్రమంలో పలువురు ఎన్.ఆర్.ఐ లు సంతోషంగా పాల్గొని రచయిత వి. ప్రకాశ్ ను ఘనంగా సన్మానించి, తెలంగాణ చరిత్రను వెలుగులోకి తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య అతిధులుగా కోదాడ నుండి వచ్చిన జలగం రంగారావు గారు, వెణు గోపాల్ గారు, టైటా అధ్యక్షుడు సందీప్ గారు హజరయ్యారు.

ఈ సందర్భంగా వి. ప్రకాష్ మాట్లడుతూ ఘంట చక్రపాణి, కే.సీ.ఆర్ ల సూచనతో ఈ పుస్తకం రాయటం జరిగిందని, 1800వ సంవత్సరం నుండి నేటి వరకు జరిగిన అనేక సంఘటనలను వెలుగులోకి తీసుకురావటంలో తను ఎన్ని కష్టాలు పడింది వివరించారు. ఈ పుస్తకం తెలుగు వర్షన్ సుమారు 50,000 కాపీలు అమ్ముడుపొయి రికార్డ్ చేసుకుంది. ఎన్.ఆర్.ఐ టీ.ఆర్.ఎస్ తరపున పాల్గొన్న సుధీర్ జలగం అవినీతి నిర్మూలన పై అడిగిన ప్రశ్నకు సమాదానంగా కే.సీ.ఆర్ పాలనలో కొంతవరకు లంచగొండి తనం తగ్గటం తను ప్రత్యక్షంగా చూసానని, పూర్తి స్థాయిలో అవినీతి నిర్మూలన జరగాలంటే తెలంగాణలోని మేధావులతో పాటు, ఎన్.ఆర్.ఐ లు రాజకీయల్లోకి వచ్చి గ్రామస్థాయి పదవులనుండి రాష్ట్రస్థాయి పదవులకు వన్నె తేవాలని పిలుపునిచ్చారు. నవీన్ వోరుగంటి ఫ్లోరొసిస్ మీద, సాయి రెడ్డి ద్వితియ శ్రేణి పట్టణాల అభివృద్ధి మీద, దినెష్ హైకోర్ట్ మీద అడిగిన ప్రశ్నలకు కూడ ఓపికతో సమాధానం ఇచ్చారు. స్థానిక ప్రముఖుడు మహిధర్ రెడ్డి గట్టిగా కోరటం తోనే సియాటెల్ కి రావటం జరిగిందని రచయిత తెలిపారు. వ్యాఖ్యాతగా నవీన్ అతిధులనందరిని సభకు పరిచయం చేసారు. వాట్ జి నుండి రాజ్, మహేష్ వాటా నుండి హరి, నవీన్, సాయి, అనురాధ లతో పాటు అనేక మంది ఎన్.ఆర్.ఐ లు పాల్గొని సభను విజయవంతం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *