- వ్యవసాయ రైతు పక్షపాతిగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వం నిలిచింది – ఎమ్మెల్యేలు
- రుణమాఫీ సంపూర్ణం చేసిన సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేనిది – ఎమ్మెల్యేలు
తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపి, గుణాత్మక ప్రగతి కార్యాచరణను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారికి మరోసారి కృతజ్జతల వెల్లువ వాన జల్లులా కురిసింది. గురువారం నాడు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హాజరైన శాసన సభ్యులు సీఎం కేసీఆర్ ను వారి చాంబర్ లో కలిసి, రైతు సంక్షేమం ప్రజా సంక్షేమం దిశగా మరోసారి పలు ప్రగతి నిర్ణయాలు తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలతో పాటు, నిన్న తీసుకున్న రైతు రుణ మాఫీ నిర్ణయానికి కృతజ్జాతాభివందనాలు తెలిపారు. దాంతో అసెంబ్లీలోని సీఎం చాంబర్ గురువారం నాడు సందడి నెలకొంది. రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు సిఎం కేసీఆర్ కు పుష్పగుచ్చాలు అందించి సీఎం కేసీఆర్ తో జిల్లాల వారీగా కలిసి ఫోటోలు దిగారు. తమ రైతుల తరఫున ప్రజల పక్షాన సీఎం గారికి ధన్యవాదాలు తెలిపారు.
రైతు రుణమాఫీ తో పాటు హైదరాబాద్ లో మెట్రో రైలు విస్తరణ, నోటరీ ఆస్తుల క్రమబద్దీకరణ నిర్ణయం, తదితర అభివృద్ధి సంక్షేమ నిర్ణయాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ గారికి కృతజ్జాతి అభినందనలు వెల్లువెత్తాయి. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శాసన సభ ప్రారంభానికి ముందే సీఎం గారి రాకకోసం వేచి చూసి వారు రాగానే పూల బొకేలు అందించారు. రైతు రుణమాఫీ చేసినందుకు వ్యవసాయ శాఖ తరపున, తెలంగాణ రైతాంగం తరఫున సీఎం కేసీఆర్ కు వ్యవసాయ శాఖ మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యులు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రైతు కుటుంబాలంతా సంబరాలు జరుపుకుంటున్నారని సీఎం కు తెలిపారు. వ్యవసాయ రైతు పక్షపాతిగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వం నిలిచిందని, రైతు బాంధవుడుగా సీఎం కేసీఆర్ మరోసారి నిలిచారని, రుణమాఫీ సంపూర్ణం చేసిన సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేనిదని వారు కొనియాడారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, కేటీఆర్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్యెల్యేలు, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో హైద్రాబాద్ ఎమ్మెల్యేలు.. వీరితో పాటు పలువురు సీఎం కేసీఆర్ గారికి కృతజ్జతలు తెలిపారు.