mt_logo

స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో తెలంగాణ గ్రామాలు టాప్

న్యూఢిల్లీ: స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా ఓడీఎఫ్ ప్లస్ కేటగిరీలో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచి, మరో అరుదైన ఘనత సాధించింది. స్వచ్ఛభారత్‌ మిషన్‌ గ్రామీణ్‌ పథకంలో దేశంలోని పెద్ద రాష్ట్రాల జాబితాలో అత్యుత్తమ పనితీరుతో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచింది. తెలంగాణలోని అన్ని గ్రామాలు బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా మారాయి. ఫేజ్‌-2లో భాగంగా ఇప్పటికే 50% వరకు గ్రామాలు ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామాలుగా మారాయి. బహిరంగ మల విసర్జన నుంచి విముక్తి పొందిన ఈ గ్రామాల్లో ఘన లేదా ద్రవ వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ అమల్లో ఉంటే వాటిని ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా పిలుస్తారు.దాదాపు 3 లక్షల గ్రామాలు తమను తాము బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించుకున్నాయి.

ఇతర రాష్ట్రాలకు మాడల్‌గా తెలంగాణ రాష్ట్రం 100 % ఓడీఎఫ్‌ ప్లస్‌ సాధించి ఇతర రాష్ట్రాలకు మోడల్‌గా నిలిచింది. తెలంగాణ తర్వాత స్థానాల్లో కర్ణాటక  (99, 5%), తమిళనాడు (97.8%) , ఉత్తరప్రదేశ్‌ (95.2%), గోవా (95.3%), సిక్కిం (69, 2%), రాష్ట్రాలకు ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో అండమాన్‌, నికోబార్‌ దీవులు, దాద్రానగర్‌ హవేలి, డామన్‌డయ్యూ, లక్షద్వీప్‌లు కూడా ఓడీఎఫ్‌ ఫ్లస్‌ 100 % సాధించాయి. ఓడీఎఫ్ ప్లస్ లో మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.