తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ కాలం జరిగిన ప్రజాఉద్యమమని తెలంగాణ సెటిలర్స్ ఫ్రంట్ అధ్యక్షులు కె.శ్రీనివాస రాజు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడాన్ని సెటిలర్స్ అంతా స్వాగతిస్తున్నారని, అయితే కాంగ్రెస్ ప్రకటనలో కొన్ని అంశాల పట్ల స్పష్టత లేని కారణంగా వారు ఆందోళన చెందుతున్నారన్నారు.
లక్డీకాపూల్‌లోని హోటల్ హంషైర్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస రాజు మాట్లాడారు. కేసీఆర్ గత 13 యేళ్లుగా చేపట్టిన ఉద్యమంతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, ఆ క్రెడిట్ ఆయనకే కానీ, కాంగ్రెస్ పార్టీది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
సీఎం కిరణ్‌కుమార్‌డ్డి మాట్లాడిన తీరు బాధ్యతారాహిత్యంగా ఉన్నదని, దీనివల్ల సెటిలర్స్ లో అభద్రతాభావం పెరిగిపోయిందని శ్రీనివాసరాజు అన్నారు.