త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీదే విజయమని, తెలంగాణ ప్రజలు మళ్ళీ సీఎం కేసీఆర్ నే ఆశీర్వదిస్తారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. 17 కు 17 సీట్లు తామే గెలుస్తామని, ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందని అసద్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. సీ ఓటర్ సర్వేను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కేటీఆర్ చేసిన ట్వీట్ ను అసద్ ఈరోజు రీ ట్వీట్ చేశారు. సీ ఓటర్ సర్వే ప్రకారం టీఆర్ఎస్ కు 16 సీట్లు, ఎంఐఎం కు 1 సీటు రానున్నాయి. టీఆర్ఎస్ విజయం సమాజంలో ప్రతి వర్గానికి విజయసంకేతంగా నిలుస్తుందని అసద్ పేర్కొన్నారు. ఈ విక్టరీతో నిజమైన ఫెడరల్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తామని అసద్ తన ట్వీట్ లో తెలిపారు.