mt_logo

రేవంత్ రెడ్డి నిర్లజ్జగా, అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నాడు : శాసనమండలి గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసనమండలి గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రెస్ మీట్ లో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. శాసనసభ మరియు శాసనమండలి సమావేశాలు నాలుగు  రోజుల పాటు జరిగాయి. సభలో వివిధ బిల్లులను పాస్ చేయడం జరిగిందని గుర్తు చేశారు.  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం హర్షణీయం. ఉభయ సభలో  ఆమోదించి ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాము. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు  ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం  కోసం కేసీఆర్ విశేషంగా కృషి చేశారు. 

తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఉద్యమ సమయంలో కన్న కలలు అన్నీ సాకారం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కేసీఆర్ పై  ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రతిపక్షాలు  మాట్లాడుతున్న భాష ప్రజాస్వామ్యానికే ప్రమాదమన్నారు. 

తెలంగాణలో ఓట్లడిగే హక్కు బీజేపీ పార్టీకి లేదు

పాపం కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్క ఛాన్స్ అని అడుగుతున్నారు. వాళ్లకు 50 ఏళ్ళు అవకాశం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ ని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలవి  పగటి కలలు గానే మిగిలిపోతాయి. కేంద్రం ఒక్క మంచి  పని కూడా  చేయలేదు. తెలంగాణ పై విషం చిమ్మారు. తెలంగాణలో ఓట్లడిగే హక్కు బీజేపీ పార్టీకి లేదు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం ఆలస్యం చేయడం వల్ల వేలాది మంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. అందుకే తెలంగాణ సమాజం కాంగ్రెస్ ని నమ్మలేదు. ఇక నమ్మరు కూడా అన్నారు. మాకు అందరికీ కేసీఆర్ ఏ స్ఫూర్తి. కేసీఆర్ గారు ఇచ్చిన  స్ఫూర్తితో నే ఉద్యమంలో పాల్గొన్నామన్నారు. 

రేవంత్ రెడ్డి నిర్లజ్జగా,అడ్డగోలుగా ఆరోపణలు

 పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అసహనంతో మాట్లాడుతున్నాడు. నిర్లజ్జగా,అడ్డగోలుగా ఆరోపణలు చేయడం రేవంత్ కు పరి పాటుగా మారింది.కేసీఆర్ పైన వ్యక్తి గతంగా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ పై ప్రేమ లేదు.ఆయనది కపట ప్రేమ మాత్రమే అన్నారు.  ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని  సీఎం కేసీఆర్ అమలు చేశారన్నారు.