mt_logo

వీధి వ్యాపారుల‌కు రుణాలు అందించ‌డంలో తెలంగాణ‌ టాప్‌

  • కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న మున్సిప‌ల్ అధికారులు 
  • 695 కోట్ల రుణాన్ని అందించిన తెలంగాణ 
  • టాప్‌లో తెలంగాణ ప‌ట్ట‌ణాలు

హైద‌రాబాద్‌, జూన్ 1 :  తెలంగాణ రాష్ట్రం మ‌రో అంశంలో దేశంలోనే ముందు నిలిచింది. వీధి వ్యాపారుల‌కు రుణాలు అందించ‌డంలో పెద్ద రాష్ట్రాల కేట‌గిరిలో అగ్ర‌భాగానా నిలిచింది. ఈ మేర‌కు కేంద్ర ప‌ట్ట‌ణాభిశవృద్ధి శాఖ మంత్రి శ్రీ‌ హిర్దిప్ సింగ్ గారి పూరి చేతుల మీదిగా అవార్డు అందుకున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం త‌రుఫున మున్సిప‌ల్, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ కార్య‌ద‌ర్శి  శ్రీ సుద‌ర్శ‌న్ రెడ్డి గారు, మెప్మా ప్రాజెక్టు మేనేజ‌ర్ శ్రీ‌ చైత‌న్య గారు అవార్డును అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర అధికారుల‌ను కేంద్ర మంత్రి అభినందించారు.  దేశంలో పెద్ద రాష్ట్రాల కేట‌గిరిలో తెలంగాణ‌, మ‌ధ్య ప్ర‌దేశ్‌, ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రాల‌కు అవార్డుల‌ను అందించారు.  వీధి వ్యాపారుల‌కు రుణాలు ఇచ్చే పీఎంస్వాన్ నిధి ప్రారంభించి మూడు సంవ‌త్స‌రాలు అయిన సంద‌ర్భంగా గురువారం ఢిల్లీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో అవార్డును అందించారు. 

తెలంగాణ ప్ర‌భుత్వం ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిలో భాగంగా వీధి వ్యాపారుల అభివృద్ధి, వారికి మౌలిక స‌దుపాయాల క‌ల్పించాల‌ని 2020 ఫిబ్ర‌వ‌రి 16న గౌర‌వ ముఖ్య‌మంత్రి శ్రీ కే చంద్ర‌శేఖ‌ర్ రావు ఎమ్మెల్యేలు, జిల్లా క‌లెక్ట‌ర్లు, మేయ‌ర్లు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌లు, చైర్మ‌న్‌ల‌తో  జ‌రిగిన స‌మావేశంలో ఆదేశించారు. ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిలో భాగంగా వీధి వ్యాపారుల‌కు రుణాలు ఇవ్వాల‌ని 2020 ఫిబ్ర‌వ‌రి 24న  మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప‌ట్ట‌ణంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆదేశించారు. వీధి వ్యాపారుల‌కు స్ట్రీట్ వెండింగ్ జోన్‌లు ఏర్పాటు చేయాల‌ని ఆదే రోజు ఆదేశించారు.  క‌రోనా కార‌ణంగా వీధి వ్యాపారులు తీవ్ర‌దెబ్బ‌తిన్నారు. ఈ నేప‌థ్యంలో వారు వ్యాపారాలు చేసుకోవ‌డానికి వ‌ర్కింగ్ క్యాపిట‌ల్ అందించాల‌ని కేటీఆర్ ఆదేశించారు. 

వీధి వ్యాపారుల‌కు ఇచ్చే రుణాల‌పై స్టాంప్ డ్యూటీని మిన‌హాయించిన దేశంలోనే మొద‌టి రాష్ట్రం తెలంగాణ‌. వీధి వ్యాపారులు క‌రోనాతో తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని, వారిని ఆదుకోవ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. వీధి వ్యాపారుల‌కు మొద‌టి విడ‌త‌లో ఒక్కొక్క‌రికి రూ.10వేల చొప్పున రుణం అందించారు. మొద‌టి విడ‌త‌లో 3.40ల‌క్ష‌ల మంది వీధి వ్యాపారుల‌కు రుణాలు ఇవ్వాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో  3,58,776 (106శాతం) వీధి వ్యాపారుల‌కు రుణాలు మంజూరు కాగా 3,56,678 మందికి రూ.353.17(105శాతం) కోట్ల‌ను పంపిణి చేశారు. మొద‌టి విడ‌త రుణాల పంపిణిలో 100 శాతం ల‌క్ష్యాన్ని చేరి తెలంగాణ దేశంలోనే మొద‌టి స్థానంలో నిలిచింది. 

టాప్‌లో తెలంగాణ ప‌ట్ట‌ణాలు..

ల‌క్ష జ‌నాభా ఉన్న ప‌ట్ట‌ణాల కేట‌గిరిలో దేశ వ్యాప్తంగా 3555 ప‌ట్ట‌ణాలు ఉండ‌గా ఈ కేట‌గిరిలో టాప్ 10కు 10 ప‌ట్ట‌ణాలు తెలంగాణ ప‌ట్ట‌ణాలే ఉన్నాయి. మొద‌టి స్థానంలో సిద్దిపేట‌, రెండో స్థానంలో సిరిసిల్ల ప‌ట్ట‌ణం, నిర్మ‌ల్‌, కామారెడ్డి, బోధ‌న్‌, జ‌హీరాబాద్, సంగారెడ్డి, మంచిర్యాల‌, పాల్వంచ‌, ఆర్మూర్ ప‌ట్ట‌ణంలో టాప్ 10లో నిలిచాయి.  లక్ష నుంచి 10 ల‌క్ష‌ల జ‌నాభా కేట‌గిరిలో దేశంలో 442 ప‌ట్ట‌ణాలు ఉండ‌గా వ‌రంగ‌ల్‌లో దేశంలోనే మొద‌టి స్థానంలో ఉండ‌గా, నిజామాబాద్ 10వ స్థానంలో ఉంది. 40ల‌క్ష‌ల పైగా ఉన్న జ‌నాభా కేట‌గిరిలో జీహెచ్ఎంసీ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. 

రెండో విడ‌త రుణాల పంపిణిలో భాగంగా మొద‌టి విడ‌త రుణాన్ని తిరిగి చెల్లించిన వారికి ఒక్కొక్క వీధి వ్యాపారికి రూ.20వేలు అందించారు. 1,45,100 మందికి రుణాలు అందించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకోగా 1,53,306 మందికి(106శాతం) మంజూరు చేశారు. ఇందులో 1,46,692 (101శాతం) రుణాల‌ను పంపిణి చేశారు. ల‌క్ష లోపు జ‌నాభా ఉన్న ప‌ట్ట‌ణాల కేట‌గిరిలో టాప్ 10 ప‌ట్ట‌ణాల్లో 10 తెలంగాణ‌కు చెందిన‌వే ఉన్నాయి. మొద‌టి స్థానంలో  మొద‌టి స్థానంలో సిరిసిల్ల ప‌ట్ట‌ణం, రెండో స్థానంలో కామారెడ్డి,  నిర్మ‌ల్‌, బోధ‌న్‌, సిద్దిపేట‌,  మంచిర్యాల‌, కోరుట్ల‌, ఆర్మూర్ , సంగారెడ్డి, జ‌హీరాబాద్ ప‌ట్ట‌ణంలో టాప్ 10లో నిలిచాయి. 

ల‌క్ష నుంచి 10ల‌క్ష‌ల జ‌నాభా ఉన్న ప‌ట్ట‌ణాల కేట‌గిరిలో వ‌రంగ‌ల్ మొద‌టి స్థానంలో నిల‌వ‌గా, నిజామాబాద్ రెండో స్థానంలో, క‌రీంన‌గ‌ర్ మూడో, రామ‌గుండం 10వ స్థానంలో ఉన్నాయి. 40ల‌క్ష‌ల జ‌నాభా దాటిన కేట‌గిరిలో గ్రేట‌ర్ హైద‌రాబాద్ దేశంలో 2వ స్థానంలో నిలిచారు.  వీధి వ్యాపారుల‌కు మూడు విడుత‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు రూ.695.42కోట్ల ను పంపిణి పూర్తి అయ్యాయి. రెగ్యుల‌ర్ రుణాలు చెల్లించిన వారికి తిరిగి వారికి ఆ రుణాన్ని బ్యాంకులు వారి అకౌంట్లో జ‌మ చేశాయి. ఇలా తెలంగాణ‌లోని వీధి వ్యాపారుల‌కు రూ.10.70కోట్లు జ‌మ అయ్యాయి. 

మూడో విడ‌త రుణాల్లో భాగంగా 20వేల రుణాన్ని తీసుకొని చెల్లించిన వారికి రూ.50వేల‌ను మూడోవిడ‌త‌లో అందించారు. 3870 మందికి రుణాలు అందించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకోగా 10661 మందికి(275శాతం) రుణాలు మంజూరు చేశారు. 10058(260శాతం) మందికి రూ.49.64కోట్లు పంపిణి చేశారు.  మూడో విడ‌త‌లో ల‌క్ష లోపు జ‌నాభా కేటగిరిలో 9 తెలంగాణ ప‌ట్ట‌ణాలు దేశంలో టాప్ 10లో నిలిచాయి. ఇందులో నిర్మ‌ల్ మొద‌టి స్థానంలో, గ‌ద్వాల రెండో స్థానంలో, సంగారెడ్డి, సిరిసిల్ల‌, పాల్వంచ‌, సిద్దిపేట‌, కొత్త‌గూడెం, బోధ‌న్‌, వ‌న‌ప‌ర్తిల నిలిచాయి. ల‌క్ష నుంచి 10ల‌క్ష‌ల జ‌నాభా కేట‌గిరిలో వ‌రంగ‌ల్ మొదటి స్థానంలో, రామ‌గుండం మూడో స్థానం, క‌రీంన‌గ‌ర్ నాలుగో స్థానం, నిజామాబాద్ 10వ స్థానంలో నిలిచాయి. 

40ల‌క్ష‌ల జ‌నాభా దాటిన కేట‌గిరిలో గ్రేట‌ర్ హైద‌రాబాద్ దేశంలో మొద‌టివ స్థానంలో నిలిచారు

3.24ల‌క్షల వీధి వ్యాపారులు డిజిట‌ల్ రూపంలో వినియోగ‌దారుల నుంచి డ‌బ్బుల‌ను స్వీక‌రిస్తున్నారు. వీరింద‌రు క్యూఆర్ కోర్‌, యూపీఐ ఐడీని క‌లిగి ఉన్నారు. డిజిట‌ల్ లావాదేవీల‌ను నిర్వ‌హించ‌డానికి వీధి వ్యాపారుల‌కు శిక్ష‌ణ కూడా ఇచ్చారు. డిజిట‌ల్ లావాదేవీలు దేశంలో ఎక్కువ చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. దేశంలోనే అతి పెద్ద జ‌నాభా ఉన్న రాష్ట్రంగా ఉన్న ఉత్త‌ర ప్ర‌దేశ్ ముందు నిలిచింది. తెలంగాణ వీధి వ్యాపారులు డిజిట‌ల్ లావాదేవీలు చేసినందుకు ప్రోత్స‌హ‌కంగా రూ.6.59కోట్ల మొత్తం వీధి వ్యాపారులు పొందారు. ఉత్త‌ర ప్ర‌దేశ్ వీధి వ్యాపారులు రూ.6.67కోట్ల మొత్తాన్ని పొందారు. తెలంగాణ ప్ర‌భుత్వం వీధి వ్యాపారుల‌కు ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిలో రుణాలు అందించ‌డ‌మే కాదు వారు వ్యాపారాలు చేసుకోవ‌డానికి అనువుగా స్ట్రీట్ వెండింగ్ జోన్‌ల‌ను ఏర్పాటు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 2676 స్ట్రీట్ వెండింగ్ షెడ్స్ నిర్మించాల‌ని నిర్ణ‌యించారు. ఇందులో 1294 పూర్తి అయ్యాయి. మిగిలిన 1382 నిర్మాణ ద‌శ‌లో ఉన్నాయి.