mt_logo

దేశానికే ఆర్థిక‌ప‌ట్టు తెలంగాణ‌.. త‌ల‌స‌రిలో నెంబ‌ర్ వ‌న్‌

  • రుణాలు-జీడీపీ రేషియోలో ఉత్తమం
  • జీఎస్‌డీపీ గ్రోత్‌లోనూ ది బెస్ట్‌
  • ఐడెక్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ 
  • ప్రెసిడెంట్‌ పాల్‌ కోశి ట్వీట్‌

హైద‌రాబాద్‌: ఆర్థికరంగంలో దేశానికే తెలంగాణ ఆదర్శం. రుణాలు-జీడీపీ రేషియోలో దేశంలోనే తెలంగాణ ఉత్తమంగా ఉన్నది. తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంలో నిలిచింది. జీఎస్‌డీపీ గ్రోత్‌రేట్‌ అద్భుతంగా ఉన్నది. దేశానికి దక్షిణాది రాష్ట్రాలే జీవ‌నాడి. దేశ జీడీపీలో దక్షిణాది ఐదు రాష్ట్రాల‌ వాటానే 30 శాతం ఉన్న‌ది. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ నివేదిక ఆధారంగా దేశ ఆర్థిక వ్యవస్థకు తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాలే ఆయువు పట్టు. 

పాల్‌ కోశి ట్వీట్ (ఐడెక్‌ అనేది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కంపెనీ)

తెలంగాణ ఏర్ప‌డితే రాష్ట్రం చీక‌టైత‌ది.. తెలంగాణోళ్ల‌కు ప‌రిపాల‌న చేత‌కాదు.. ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డితే ప్ర‌జ‌ల‌ను దేవుడే కాపాడాలి.. ఇవీ సీమాంధ్ర పాల‌కుల శాప‌నార్థాలు. వాట‌న్నింటినీ ప‌టాపంచ‌లు చేస్తూ తెలంగాణ కేవ‌లం తొమ్మిదేండ్ల‌లోనే దేశానికే ఆర్థిక‌ ప‌ట్టుగా మారింది. త‌ల‌స‌రి ఆదాయంలో నంబ‌ర్‌వ‌న్‌గా నిలిచి ఔరా అనిపించింది. జీఎస్‌డీపీ గ్రోత్‌లోనూ దూసుకుపోతూ అంద‌రి నోర్లూ మూయించింది. రుణాలు-జీడీపీ రేషియోలో దేశంలోనే తెలంగాణ ఉత్తమంగా నిలిచి అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది. ఇవేవో గాలిలో చెప్తున్న ముచ్చ‌ట్లు కాదు.. తెలంగాణ ఆర్థిక ప్ర‌గ‌తి గురించి బెంగ‌ళూరు కేంద్రంగా ప‌నిచేస్తున్న ప్ర‌తిష్టాత్మ‌కం సంస్థ ఐడెక్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పాల్‌ కోశి ట్వీట్ చేశారు. భార‌త‌దేశానికి ద‌క్షిణ భార‌తం.. అందులో తెలంగాణ జీవ‌నాడిగా ఎలా మారిందో వివ‌రించారు.

తలసరిలో తెలంగాణ తోపు

2022-23 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం..తెలంగాణ రూ.2,75,443 తలసరి ఆదాయంతో దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంలో ఉన్నది. ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో రూ.2,65,623తో కర్ణాటక రెండో స్థానంలో నిలిచింది. తమిళనాడు రూ.2,41,131, కేరళ రూ.2,30,601 తలసరి ఆదాయంతో మూడు, నాలుగో స్థానంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రూ. 2,07,771 తలసరి ఆదాయంతో చివరి స్థానంలో నిలిచింది. ఈ దక్షిణాది రాష్ట్రాలన్నీ జాతీయ సగటు రూ.1,50,007 కంటే ఎకువ తలసరి ఆదాయాన్ని కలిగి ఉన్నాయి.

రుణాల రేషియోలో తెలంగాణే  ఉత్త‌మం

రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉన్నదని చెప్పడానికి జీఎస్‌డీపీలో రుణాల రేషియో ఏ మేరకు ఉన్నదనే విషయాన్ని ఆర్‌బీఐ ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటుంది. రుణాలు-జీడీపీ రేషియో తకువగా ఉంటే ఆ రాష్ట్రం ఆర్థికంగా బలంగా ఉన్నట్టు ఆర్‌బీఐ పరిగణిస్తుంది. ఈ విషయంలోనూ దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. అందులోనూ తెలంగాణ టాప్‌ ప్లేస్‌లో నిలుస్తున్నది. రుణం-జీడీపీ రేషియో అతి తకువగా తెలంగాణాలో 25.3 శాతంగా ఉన్నది. కర్ణాటకలో 27.5 శాతం, తమిళనాడులో 27.7 శాతం, ఆంధ్రప్రదేశ్‌ లో 32.8 శాతం, కేరళలో 37.2 శాతంగా ఉన్నది. ఉత్తరాది రాష్ట్రాల‌తో పోలిస్తే ఈ ఐదు దక్షిణాది రాష్ట్రాలు రుణాలు తీసుకోవడంలోనూ ఆదర్శంగానే ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలో లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ద‌క్షిణాది రాష్ట్రాలదే కీల‌క పాత్ర

2022-23 ఆర్థిక సంవత్సరంలో తమిళనాడు జీఎస్‌డీపీ రూ.24.8 లక్షల కోట్లు, కర్ణాటక రూ.22.4 లక్షల కోట్లు, తెలంగాణ రూ.13.3 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ రూ.13.2 లక్షల కోట్లు, కేరళ జీఎస్‌డీపీ రూ.10 లక్షల కోట్లు ఉన్నది. దేశంలో దక్షిణాది రాష్ట్రాల‌ జనాభా వాటా 19 శాతం. మిగిలిన రాష్ట్రాల‌ జనాభా వాటా 79 శాతం. దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల‌ వాటా 30 శాతం. దేశాన్ని సాకుతున్న రాష్ట్రాల్లో దక్షిణాదే కీలకపాత్ర పోషిస్తున్నది.