- తెలంగాణ ప్రాంతంలో నెలకొని ఉన్న చరిత్ర పరిశోధన పుస్తకాలను ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్.
- తెలంగాణ ప్రాంతంలో ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది.
- చరిత్ర పరిశోధకుల బృందం తెలంగాణ ప్రాంతంలోని చరిత్రపై లోతైన అధ్యాయనం చేయాలి.
- తెలంగాణ లోని చరిత్రను భవిష్యత్ తరాలకు పుస్తకాల రూపంలో చరిత్రను భద్రపరచాలి.
- తెలంగాణ పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని చరిత్ర పరిశోధకుల కృషి అభినందనీయం మంత్రి శ్రీనివాస్ గౌడ్.
హైదరాబాద్ : తెలంగాణ ప్రాంతంలో నెలకొని ఉన్న చరిత్ర పరిశోధకులు రామోజు హరగోపాల్ రచించిన తొలత తెలుగు రాతి రాత ‘తోలుచు వ్రాన్డ్రు’, ‘తెలంగాణ చరిత్ర తొవ్వలో’ రెండు చరిత్ర పరిశోధన పుస్తకాలను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సూచనల మేరకు తెలంగాణ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న వారసత్వ, చారిత్రాత్మక, సమగ్ర చరిత్ర ను పరిశోధకులు భవిష్యత్తు తరాలకు అందించేందుకు పుస్తకాల రూపంలో వెలుగులోకి తీసుకొస్తున్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ ప్రాంతంలో ఎంతో ప్రాచీన చరిత్ర ఉందన్నారు. చరిత్ర పరిశోధకుల బృందం తెలంగాణ ప్రాంతంలోని చరిత్రపై లోతైన అధ్యాయనం చేయాలనీ కోరారు .తెలంగాణ లోని చరిత్రను భవిష్యత్ తరాలకు పుస్తకాల రూపంలో చరిత్రను భద్రపరచాలనీ మంత్రి ఆదేశం. తెలంగాణ ప్రాంతంలో మరుగున పడిన అసలైన చరిత్రను బయటకు తీసేందుకు సమగ్ర చరిత్రపై మరిన్ని పరిశోదాత్మక పుస్తకాలు రావాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు.
తెలంగాణ ప్రాంతంలో చారిత్రాత్మక సంపద ఎంతో ఉంది
తెలంగాణ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చరిత్ర పరిశోధకుల బృందం కన్వీనర్ రామోజు హరి గోపాల్ రంగారెడ్డి జిల్లాలోని కీసరగుట్టలో జరిపిన పరిశోధనలో వెలుగు చూసిన తొలుచు వ్రాన్డ్రు శాసనమే తొలి తెలుగు రాతి రాత శాసనం గా గుర్తించబడటం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రాంతంలో చారిత్రాత్మక సంపద ఎంతో ఉందన్నారు. చరిత్ర పరిశోధకులు తెలంగాణ ప్రాంతంలో ఉన్న సమగ్ర చరిత్రను వెలికి తీయడానికి పూర్తి సహకారం అందిస్తున్నామన్నారు. తెలంగాణ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పరిశోధకులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు తెలంగాణ ప్రాంతంలో ఉన్న చరిత్ర బయటకు తీసేందుకు చరిత్రకారులు మరింత కృషి చేయాలన్నారు. చారిత్రక పరిశోధక పుస్తకాలను రచించిన రామోజు హర గోపాల్, ప్రముఖ చరిత్ర పరిశోధకులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గార్లను మంత్రి ఘనంగా సన్మానించారు.