mt_logo

బీసీ హాస్టల్ విద్యార్థులకు తీపి కబురు చెప్పిన తెలంగాణ ప్రభుత్వం 

  • ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతో సమానంగా బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు వసతులు
  • 34 వేల మంది బీసీ బిడ్డలకు చేకూరనున్న లబ్ధి
  • భోజనం, వసతితోపాటు కాస్మెటిక్, బ్లాంకెట్లు, నోట్ బుక్స్ ఇతరత్రా సౌకర్యాలు
  • 19 గురుకులాల నుండి 327 కు పెంపు

కరీంనగర్: రాష్ట్రంలో బీసీ విద్యా సంబంధిత అంశాలైన జాతీయ సంస్థల్లో బీసీ రీయింబర్స్ మెంట్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు సకల వసతులు వంటి నూతన కార్యక్రమాలకు సంబంధించిన జీవో విడుదల, నూతన లోగో విడుదలను ఈ నెల 28 శుక్రవారం బీసీ మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్ తో పాటు బీసీ సంఘం నేతలు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇతర నేతల సమక్షంలో విడుదల చేస్తామన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఈ మేరకు కరీంనగర్ లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. విద్యనే అన్నింటికి మూలమని, సామాజిక సమానత్వం విద్యతోనే సాధ్యమనే గొప్ప నిర్ణయంతో ముఖ్యమంత్రి బీసీలకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. నిన్ననే తెలంగాణ బీసీ బిడ్డలకు జాతీయ స్థాయిలోని నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ లోని ప్రతిష్టాత్మక ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ తదితర 200కు పైగా విద్యాసంస్థల్లో బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందజేసే పథకాన్ని ప్రకటించుకున్నామన్నారు మంత్రి గంగుల.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ల విద్యార్థులకు తీపికబురు కేసీఆర్ సర్కార్ అందిస్తుందన్నారు, రాష్ట్రంలోని 401 ప్రీమెట్రిక్ హాస్టల్ లోని 30,732 మంది విద్యార్థుల మాదిరే రాష్ట్రంలోని బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ల విద్యార్థులకు సైతం సంపూర్ణ వసతులు కల్పిస్తున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్. రాష్ట్రంలోని 302 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలోని 34వేలకు పైగా బీసీ విద్యార్థులకు ఈ సంవత్సరం నుండి భోజన, వసతితోపాటు పూర్తి స్థాయిలో కాస్మెటిక్ చార్జీలు, వులన్ బ్లాంకెట్స్, బెడ్ షీట్స్, కార్పెట్స్, నోట్ బుక్స్ తదితర సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. గతంలో భోజన, వసతి మాత్రమే అందజేసే వాళ్లమని, నేటి నిర్ణయంతో విద్యార్థులు మరింత ఉత్సాహంతో విద్యను అభ్యసించి రాష్ట్రం పేరును నిలబెడతారని ఆశాభావం వ్యక్తం చేసారు. ఇప్పటికే బీసీ గురుకులాల విద్యార్థులు రాష్ట్రం పేరును జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా నిలుపుతున్నారని, నిన్ననే రాష్ట్ర, అంతర్జాతీయం తో పాటు జాతీయ స్థాయిలోని ప్రతిష్టాత్మక సంస్థల్లో చేరే బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ప్రకటించిందని ఇలాంటి అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు మంత్రి గంగుల కమలాకర్.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకాలైన రైతుబంధు, ఆసరా పింఛన్లు, 24 గంటల ఉచిత విద్యుత్, కల్యాణ లక్ష్మి వంటి పథకాల్లో మెజార్టీ వాటా అందజేయడం తో పాటు, కోకాపేట, ఉప్పల్ భగాయత్ లాంటి ఖరీదైన ప్రాంతాల్లో వేల కోట్ల విలువ గల స్థలాల్లో 42 కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు, గ్రామాల్లో కమ్యూనిటీ హాల్లు, కులవృత్తుల పునర్వైభవానికి ఆర్థిక సాయం, గతంలో కేవలం 19 గురుకులాల నుండి 327 గురుకులాలకు పెంచి 152 పదో తరగతి వరకు, 142 ఇంటర్ వరకు 33 డిగ్రీ కాలేజీలు ద్వారా 1,87,230 మంది విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య, 20 లక్షల రూపాయల ఓవర్సీస్ స్కాలర్షిప్ లు తదితర ఎన్నో పథకాల ద్వారా వెనుకబడిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు మంత్రి గంగుల కమలాకర్.