mt_logo

నేటి నుంచి తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్..

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2015 ప్రవేశాల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. కౌన్సెలింగ్‌లో భాగంగా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 18 నుంచి 23 వరకు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. అభ్యర్థుల ర్యాంకు ఆధారంగా నిర్ణయించిన తేదీల్లో అవసరమైన ధ్రువ పత్రాలతో కేటాయించిన కేంద్రాల్లో హాజరుకావాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

ఫీజుల వివరాలు:
ధ్రువపత్రాల పరిశీలనకు ప్రతి అభ్యర్థి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది.
అభ్యర్థులు తీసుకురావాల్సిన సర్టిఫికెట్లు
– తెలంగాణ ఎంసెట్-2015 ర్యాంకు కార్డు
– హాల్‌ టికెట్
– ఇంటర్, ఎస్సెస్సీ మెమోలు
– 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్స్
– ఒక వేళ చదువు మధ్యలో ఆపేసినట్లయితే నివాస ధ్రువీకరణ పత్రం
– ఆదాయం సర్టిఫికెట్
– కులం సర్టిఫికెట్
పైన తెలిపిన ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు, రెండు జతల జిరాక్స్ కాపీలు, ఆధార్ జిరాక్స్ కాపీని తీసుకురావాలని సంబంధిత అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *