న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని సీమాంధ్రనేతలు కలిశారు. ఇవాళ వారితో ఆమె సుధీర్థంగా చర్చించినట్టు సమాచారం. సీమాంధ్ర నేతలను సోనియా బుజ్జగించినట్టు తెలుస్తుంది. తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందని, ఈ పరిస్థితుల్లో వెనక్కి వెళ్లలేమని ఆమె వారితో చెప్పారు. అయితే రాష్ట్ర విభజన జరిగితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందిన నేతలు ఆమెతో అన్నారు. అయితే ‘ఈ ఒక్కరోజుతో అంతా అయిపోందని అనుకోవద్దు. ఆందోళన చెందవద్దు. మీ ప్రాంతాలకు అన్యాయం జరుగకుండా చూస్తాం. సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలు కాపాడే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం’ అని ఆమె వారికి హామి ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ‘బాధ్యాతాయుతమైన నిర్ణయం తీసుకుంటాం. మీ డిమాండ్లు ఏమిటో చెప్పండి, పరిశీలిస్తామని ఆమె అన్నారు.
[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]