mt_logo

ఎన్నారైలకు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత ఎంతో సేవ చేశారు..

ఎంపీ అభ్యర్థి కవితను రికార్డు మెజారిటీతో గెలిపించాలని నిజామాబాద్ ప్రజలకు ఎన్నారైల విజ్ఞప్తి..
లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యూకే (టాక్) సంస్థ ప్రతినిధులు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవితను రికార్డు మెజారిటీతో గెలిపించాలని నిజామాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖను విడుదల చేశారు.

కవితకు, టాక్ సంస్థకు ప్రత్యేక అనుబంధం ఉంది. మా సంస్థ ఆవిర్భావం నుంచి మమ్మల్ని అన్ని రకాలుగా ప్రోత్సహించడమే కాకుండా మాలాంటి ఎందరో ప్రవాసులకు ఎల్లవేళలా అండగా ఉంటూ, ముఖ్యంగా ఆపదలో ఉన్న ఎన్నారై బిడ్డలకు ఎన్నో రకాల సహాయ సహాకారాలు అందిస్తున్న కవిత నిజామాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం వాళ్ల అదృష్టం. గల్ఫ్ ఎన్నారై బిడ్డలు ఆపదలో ఉన్నారని తెలియగానే వెంటనే స్పందించి వారికి ఎన్నో రకాలుగా అండదండలు అందించిన నాయకురాలు కేవలం కవిత మాత్రమే. మళ్లీ కవితను గెలిపించుకుంటే చాలా మంది జీవితాలు బాగుపడతాయి. అనుక్షణం నిజామాబాద్ ప్రజల శ్రేయస్సుకై అలుపెరుగని కృషి చేస్తూ, అన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తున్న కవితను భారీ మెజారిటీతో గెలిపించుకోవడం చారిత్రక అవసరం.

నిజామాబాద్ రైతులు, ప్రజలు సంతోషంగా ఉండాలన్నా, మాలాంటి ఎన్నారై బిడ్డల జీవితాలకు భరోసా ఉండాలన్నా కవితను మళ్లీ పార్లమెంట్‌కు పంపించాల్సిన బాధ్యత నిజామాబాద్ ప్రజలందరిది. మీరంతా ఇతర పార్టీల ప్రలోభాలకు, లేనిపోని తప్పుడు వాగ్దానాలకు లొంగకుండా కవితను భారీ మెజారిటీతో గెలిపించాలి.. అని టాక్ సంస్థ కోరింది. ఈ ప్రకటనను టాక్ సంస్థ అధ్యక్షురాలు పవిత్ర కంది, సలహామండలి చైర్మన్ గోపాల్ మేకల, ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం, ఉపాధ్యక్షుడు సేరు సంజయ్ విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *