మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన కొనసాగుతున్నది. ఫ్రెంచ్-అమెరికన్ ఆయిల్ అండ్ గ్యాస్ దిగ్గజం అయిన టెక్నిప్ ఎఫ్‌ఎంసీ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. సాఫ్ట్‌వేర్ గ్లోబల్ డెలివరీ సెంటర్ అండ్ ప్రెసిషన్ ఇంజినీరింగ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకున్నది.$650M (రూ. 5,400 కోట్లు) ఎగుమతి విలువతో $150M (రూ. 1,250 కోట్లు) పెట్టుబడితో నగరంలో కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. ఈ పెట్టుబడి హైదరాబాద్‌కు అదిపెద్ద ప్రోత్సాహం లభించినట్లయిందని, నగర సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచిందన్నారు మంత్రి . ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇందువల్ల ఇంజినీరింగ్ విభాగంలో 2500 ఉద్యోగాలు, తయారీ రంగంలో మరో 1000 ఉద్యోగాలు రానున్నాయి. టెక్నిప్ ఎఫ్‌ఎంసీ నిర్ణయం పట్ల మంత్రి కేటీఆర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.