mt_logo

తెదేపా రెంటికీ చెడ్డ రేవడి కానుందా?

 

తెలంగాణ ఏర్పాటుపై ఒక స్పష్టత లేకుండా రెండు రోజులు ఇటు, రెండు రోజులు అటు మాట్లాడుతున్న చంద్రబాబు వైఖరితో తెలుగుదేశం రెండు ప్రాంతాల్లో మునిగిపోతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి.

సమైక్యాంధ్రకు అనుకూలంగా ఇటీవల చంద్రబాబు చేపట్టిన బస్సు యాత్రకు సీమాంధ్రలో ఆదరణ కొరవడడమే ఇందుకు సాక్ష్యం. 11 రోజుల పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తిరిగి తాను సీమాంధ్ర ప్రజల పక్షపాతిని అని ఆయన ఎంత చెప్పుకున్నా వినే నాధుడు కరువయ్యాడు.

తెలంగాణలో అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీని ఫణంగాపెట్టి మరీ చంద్రబాబు సమైక్యాంధ్రకు అనుకూలంగా మాట్లాడాడు. 2000 సంవత్సరంలో NDA ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాకుండా తానే అడ్డుకున్నానని కూడా చంద్రబాబు మొదటిసారి బహిరంగంగా ఒప్పుకున్నాడు.

ఈ మాటలతో తెలంగాణ టీడీపీ నాయకుల పరిస్థితి పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టు కాగా, సీమాంధ్రలో ఆ పార్టీకీ పెద్దగా ఒరిగిందేమీ లేదనే చెప్పాలి.

గుంటూరు, కృష్ణా జిల్లాలో చంద్రబాబు బస్సు యాత్రను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. ఎక్కడా ఆయన మీటింగులకు వెయ్యిమందికి మించి ప్రజలు రాలేదు. దీంతో ఇంకో రెండు రోజుల యాత్ర మిగిలిఉండగానే, దాన్ని రద్దుచేసుకుని హైదరాబాద్ బాట పట్టాడు ఆయన.

ఇప్పటికీ తెలంగాణకు అనుకూలమో, ప్రతికూలమో చెప్పకుండా మాటలగారడీతోనే నెగ్గుకురావాలనుకుంటున్న చంద్రబాబు పార్టీ, రెండు ప్రాంతాల్లోనూ చావుదెబ్బ తినడం ఖాయంగా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *