mt_logo

భీష్మ శపథాన్ని నిలబెట్టుకుని.. కృష్ణమ్మ వరంతో పాలమూరు కష్టాలు తీరుస్తున్న తెలంగాణ శిల్పి సీఎం కేసీఆర్

పాలమూరు కష్టాలు తీరినట్లే అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.  పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతుల నేపథ్యంలో ఆయన స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సుధీర్ఘ ప్రయత్నాలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లభించాయి. ఈ పాటికి ప్రాజెక్టు పూరై ప్రజలకు రెండేళ్ల క్రితమే ప్రాజెక్టు ఫలితాలు ప్రజలకు అందాల్సి ఉంది. ఒక వైపు ఇంటి దొంగల కేసులు, పొరుగు రాష్ట్రం అభ్యంతరాలు, మరోవైపు కేంద్ర ప్రభుత్వం సహకరించని తీరుతో నిర్దిష్ట సమయంలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుకు ఆటంకాలు ఏర్పడ్డాయి. కానీ ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇప్పటికే 85 శాతం పనులు పూర్తయి త్వరలో నీళ్లివ్వడానికి సిద్దమయ్యామని తెలియపారు. 

పాలమూరు ప్రజల కాళ్లను కృష్ణమ్మ నీళ్లతో తడుపుతానని, మడి, మడి తడుపుతానని శపథాన్ని నెరవేరుస్తున్న సీఎం 

మిగిలిన పనులను వీలయినంత తొందరగా పూర్తి చేస్తాం .. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా విడుదల చేస్తాం అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మాట ఇచ్చినట్లు పాలమూరు ప్రజల కాళ్లను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా కృష్ణమ్మ నీళ్లతో తడుపుతానని, మడి, మడి తడుపుతానని శపథం చేశారని గుర్తు చేసారు. ఆ కల త్వరలోనే నెరవేరబోతున్నది. 55, 60 ఏళ్ల జిల్లా ప్రజల వెతలు సంపూర్ణంగా తీరే శుభసమయం ఆసన్నమవుతున్నదన్నారు. రైతులు, ప్రజలు వేయి కళ్లతో  ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నర్సాపూర్, ఏదులలో పంపుల ఎరెక్షన్ పనులు పూర్తయ్యాయి.  మిగిలిన పనులు ఈ అనుమతుల కోసం ఆగాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సుధీర్ఘ వ్యూహానికి, ముందుచూపుకు ఇది ప్రతీక అన్నారు. ఎన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును తీసుకువెళ్లడం అనే అనితర సాధ్యమైన పని కేసీఆర్ సాధ్యమయింది .. మరెవరివల్లా ఇది సాధ్యం అయ్యేది కాదన్నారు.