mt_logo

కేవలం రూ. 6,800 కోట్లు ఇస్తే రూ. లక్ష లోపు రైతు రుణాలు ఎలా మాఫీ అవుతాయి?: నిరంజన్ రెడ్డి

రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తప్పుబట్టారు.

కేసీఆర్ హయాంలో మొదటి విడత రుణమాఫీ రూ.లక్ష చొప్పున 36 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమచేయగా రూ.17,000 వేల కోట్లు అయ్యాయి.. మరి ఇప్పుడు 2024 కాంగ్రెస్ పాలనలో రూ. లక్ష లోపు రుణాలున్న రైతులు 11.5 లక్షల మంది రైతులు మాత్రమే ఎలా ఉంటారు? రూ. 6800 కోట్లు ఇస్తే మొత్తం ఎలా మాఫీ అవుతాయి అని ప్రశ్నించారు.

అసలు లక్ష వరకు రుణం తీసుకున్న రైతులు ఎంత మంది..రూ.2 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులు ఎంత మంది అని అడిగారు. రూ.2 లక్షల రుణం మాఫీ చేయడానికి ఎంత అవుతుంది.. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వివరించాలి అని డిమాండ్ చేశారు.