mt_logo

కాంగ్రెస్ పాపం పాలమూరుకు శాపం : మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాదయాత్ర సంధర్భంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై స్పందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి..  కాంగ్రెస్ పాపం, పాలమూరుకు శాపమన్నారు,  మల్లు భట్టి విక్రమార్క పాలమూరు చరిత్ర తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది, తెలంగాణ కావాలని జనం ఉద్యమిస్తుంటే,యువత బలిదానాలు చేస్తుంటే శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం కలిపి తెలంగాణోత్తరాంధ్ర కావాలని రాష్ట్ర కాంగ్రెస్ కేంద్ర కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాసిన చరిత్ర, పాలమూరు రంగారెడ్డికి అడ్డుపుల్లలు వేసిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు.  263 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలంను వదిలి 6 టీఎంసీల సామర్థ్యం ఉన్న జూరాల దగ్గర నుండి నీళ్లు తీసుకోవాలని పట్టుబట్టింది కాంగ్రెస్సే అన్నారు. వందల కేసులను ఎదుర్కొని పాలమూరు రంగారెడ్డి పనులను తుదిదశకు తీసుకువచ్చాం, భట్టి విక్రమార్క ఏం జరింగిదో ? ఏం జరుగుతున్నదో ? తెలుసుకుని మాట్లాడాలన్నారు. 

పాలమూరు వలసలు, ఆకలిచావులకు కారణమే కాంగ్రెస్, కాంగ్రెస్ నాలుగు దశాబ్దాల పాలనలో పాలమూరును భ్రష్టుపట్టించింది. పోతిరెడ్డిపాడు బొక్క పెట్టి పాలమూరు పొట్టగొట్టింది, జూరాల, నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు దశాబ్దాల పాటు సాగదీసింది కాంగ్రెస్ పార్టీనే,  తెలంగాణ వచ్చాకనే జూరాల నుండి పూర్తిస్థాయిలో సాగునీళ్లు అందుతున్నాయన్నారు. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం, ఆయా ఎత్తిపోతల పథకాలలో నిలిచిపోయిన పనులు కూడా కాంగ్రెస్ పాలన పుణ్యమేన్నారు. పాలమూరు రంగారెడ్డి గురించి ప్రశ్నించే నైతిక అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు, కృష్ణా జలాల్లో వాటా తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వం .. కాంగ్రెస్‌ ఎంపీలు ఒక్కనాడన్నా పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారా ? పాలమూరు గురించి, ప్రాజెక్టుల గురించి భట్టి విక్రమార్క ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది .. లేకుంటే పోయేది కాంగ్రెస్ పరువే అన్నారు.