విద్యుత్ కొనుగోలు అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన కమీషన్ చైర్మన్‌కు విచారణార్హత లేదని మాజీ సీఎం కేసీఆర్ సుప్రీం కోర్టులో వేసిన పిటీషన్‌పై ఈరోజు విచారణ జరిగింది. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని తప్పు పట్టిన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్.. కమీషన్ చైర్మన్ విచారణ పూర్తవక ముందే తన అభిప్రాయం చెప్పటమేంటని ప్రశ్నించారు. కమిషన్ చైర్మన్‌ను మార్చేందుకు ప్రభుత్వానికి అవకాశం ఇస్తామని చెప్పారు.
కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారు.. కమిషన్ చైర్మన్ ఎలా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు.. మరొక జడ్జిని నియమించండి. న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాకుండా, నిష్పక్షపాతంగా కనపడాలి అని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదిస్తూ.. విద్యుత్ విచారణ కమిషన్ నియామకంలో పరిధిని అతిక్రమించారు. ట్రిబ్యునల్స్ ఉండగా, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఎలా న్యాయ విచారణ ఎలా వేస్తారు అని అన్నారు.
కొత్త రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో విద్యుత్ కొనుగోలు జరిగింది. మార్కెట్ రేట్ కంటే తక్కువగా, మేము యూనిట్ 3.90 రూపాయలకి మాత్రమే కొనుగోలు చేశారు ఆని తెలిపారు.
ఇది కక్ష సాధింపు చర్య.. విచారణకు ముందే దోషిగా తేలుస్తున్నారు. ఈఆర్సీ ఉండగా మళ్లీ విచారణ కమిషన్ అవసరం లేదు. అత్యవసర పరిస్థితుల్లో టెండర్లు లేకుండా విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉంది అని రోహత్గి అన్నారు.
సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో విచారణ కమిషన్ చైర్మన్ పదవి నుండి రిటైర్డ్ జస్టిస్ నరసింహ రెడ్డి తప్పుకున్నారు. కొత్త చైర్మన్ పేరును సోమవారం వెల్లడిస్తామని ప్రభుత్వం తరుపు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు.