తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తేనే మహబూబాబాద్‌లో మహా ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. మహా ధర్నాకు అనుమతి ఇచ్చిన న్యాయస్థానానికి ధన్యవాదాలు అని అన్నారు..
మహా ధర్నాకు అనుమతి ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డికి చెంపపెట్టు. రాహుల్ గాంధీ ఏమో రాజ్యాగాన్ని పట్టుకొని పార్లమెంట్‌లో ప్రమాణస్వీకారం చేస్తారు. రేవంత్ రెడ్డి ఏమో అదే రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారు అని దుయ్యబట్టారు.
లగచర్ల గిరిజన రైతులు ఎదురు తిరగడం చూసి రేవంత్ రెడ్డి ఖంగుతిన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో ఇంత తిరుగుబాటు అని రాష్ట్రవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. లగచర్ల రైతులనే మెప్పించని రేవంత్ రెడ్డి, రాష్ట్రాన్ని ఏం మెప్పిస్తారు? అని అడిగారు.
కనీసం ఊరు దాటని గిరిజన మహిళలు, ఢిల్లీ వరకు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇకనైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలి.. లగచర్లలో ఫార్మా విలేజ్‌ను రద్దు చేసుకోవాలి. మానుకోటతో ఎవరు పెట్టుకున్న వారికి మూడుతుంది.. గతంలో కాంగ్రెస్‌కు మూడింది. ఇప్పుడు మానుకోట నుండే రేవంత్ రెడ్డి పతనం స్టార్ట్ అయ్యింది అని అన్నారు.
25న మహబూబాబాద్‌లో గిరిజన, దళిత రైతులతో మహా ధర్నా చేపడతాం. ధర్నాతో ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తాం అని సత్యవతి రాథోడ్ తెలిపారు.