సివిల్స్-2014 ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. వరంగల్ జిల్లాకు చెందిన సతీష్ రెడ్డి పింగళి 97వ ర్యాంకు సాధించారు. 100 లోపు ర్యాంకు రావడంతో ఆయన తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు. తమ కుమారుడు సివిల్ సర్వీసెస్ కు ఎంపికవ్వడం తమకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. మరోవైపు సివిల్స్ విజేతలకు ప్రధానమంత్రి మోడీ శుభాకాంక్షలు తెలిపారు. దేశసేవ చేయడానికి ప్రయాణం ప్రారంభిస్తున్నవారికి శుభాకాంక్షలు అంటూ మోడీ ట్వీట్ చేశారు. సివిల్స్ పరీక్షలో విజయం పొందని వారికి ఇది కేవలం ఒక భాగమని, భవిష్యత్ ప్రణాళికలను ఇది అడ్డుకోకూడదని పేర్కొన్నారు.