పార్లమెంట్ సమావేశాల్లో బండి సంజయ్ అదుపు తప్పారు. తెలంగాణ సర్కారుతోపాటు తన ప్రాణాలకు తెగించి రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీఆర్‌పైన అవాకులు చవాకులు పేలారు. హిందీ, ఇంగ్లిష్ భాషలో జీరో అయిన బండి లోక్‌సభలో తెలుగులోనే ఆవేశపూరిత అనాలోచిత ప్రసంగం చేశారు. మణిపూర్ అల్లర్ల విషయంలో ఎన్టీఏ ప్రభుత్వంపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మాణం సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తున్నట్టు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని గప్పాలకు పోయారు. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షస సమితి అని.. కేసీఆర్ అంటే ఖాసిం చంద్రశేఖర్ రిజ్వీ అని తానో ఎంపీ అనే విషయం మరిచి విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద నిధులు విడుదల చేస్తుంటే.. వాటిని కేసీఆర్ సర్కార్ దోచుకుంటున్నదని అసత్య ఆరోపణలు చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారంటూ మరోసారి తన పరువు తానే తీసుకొన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పదవి కోల్పోయిన తర్వాత అసహనంతో రగిలిపోతున్న బండి సంజయ్.. పార్లమెంట్‌లో తన అసహనాన్ని వెళ్లగక్కారు. సంక్షేమ సర్కారుపై లోక్‌సభ సాక్షిగా విషం చిమ్మడంపై తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు.
బండీ.. కరెంట్ వైర్లు పట్టుకో..!!
తెలంగాణలో 24 గంటల కరెంట్ ఎక్కవ వస్తున్నదని లోక్‌సభలో ప్రశ్నించిన బండి సంజయ్‌కి తెలంగాణ ప్రజలు, నెటిజన్లు చురకలంటించారు. బండి సంజయ్‌కి అనుమానం ఉంటే కరెంట్ వైర్లు పట్టుకోవాలని సవాల్ విసిరారు. తెలంగాణ సాధించి.. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలను నిజం చేస్తున్న బీఆర్ఎస్‌ను భ్రష్టాచార్ రాక్షస సమితి అని అభివర్ణిస్తారా? అంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణ ఏర్పాటుపై విషం చిమ్మిన మోదీ సర్కారులో ఉండి.. బండి సంజయ్ మరోసారి లోక్‌సభ సాక్షిగా తెలంగాణను అవమానించారంటూ మండిడ్డారు. తెలంగాణ సాధించి.. పూర్తి ప్రజాధరణతో రెండుసార్లు సీఎంగా గెలిచిన కేసీఆర్‌ను ఖాసిం చంద్రశేఖర్ రిజ్వీ అంటూ అవహేళన చేయడంపై తెలంగాణవాదులు భగ్గుమన్నారు. ఓ ఉద్యమ నాయకుడు, రాష్ట్రానికి సీఎం అయిన కేసీఆర్‌కు ఓ ఎంపీ ఇచ్చే గౌరవం ఇదేనా? ఇది బీజేపీ పార్టీ సంస్కారమా? అని ప్రశ్నించారు.
స్పీకర్‌గారు బండి వ్యాఖ్యలపై ఏమంటారు? – మంత్రి కేటీఆర్
పార్లమెంట్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఎంపీ బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీని అవమానించిన కాంగ్రెస్ ఎంపీపై చర్యలు తీసుకొన్న స్పీకర్‌గారూ.. సీఎం కేసీఆర్‌పై నీచమైన కామెంట్స్ చేసిన బండి సంజయ్‌ని ఏం చేయాలో చెప్పండి అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రశ్నించారు. మోదీ ఇంటిపేరు మార్చినందుకే కాంగ్రెస్ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేశారు..పూర్తి ప్రజాధరణతో రెండుసార్లు సీఎంగా ఎన్నికైన సీఎం కేసీఆర్‌ను దూషించిన బండి సంజయ్‌ను ఏం చేస్తారు అని స్పీకర్ ఓంబిర్లానుద్దేశించి ట్వీట్ చేశారు.