ఫొటో: విజయనగరంలో ఒక వైన్ షాపును లూటీ చేస్తున్న సమైక్య ఉద్యమకారులు
—
గత రెండు రోజులుగా విజయనగరంలో జరుగుతున్న సంఘటనలు గమనిస్తే “సమైక్య ఉద్యమం” ముసుగులో అరాచక శక్తులు చెలరేగిపోతున్నాయని స్పష్టమవుతోంది.
ముఖానికి గుడ్డలు కట్టుకున్న ఆగంతకులు కొందరు శనివారం నాడు రాత్రి 8 నుండి 9:30 మధ్య విజయనగరం టౌనులో కోట నుండి కన్యకాపరమేశ్వరి గుడి వరకు ఉన్న 12 దుకాణాల తలుపులు పగులగొట్టి దోపిడీచేశారు. వీరు అత్యంత వ్యూహాత్మకంగా దోపిడీకి వెళ్లేముందు ఆ ప్రాంతంలో విద్యుత్ తీసివేసి దోపిడీకి పాల్పడుతున్నారు.
ఇక నిన్న సందట్లో సడేమియా అని కోట వద్దగల వైను షాపును కొందరు సమైక్య ఉద్యమకారులు లూటీచేసి మందు సీసాలు ఎత్తుకుపోయారు.
ఈ సంఘటనలు చూస్తుంటే అచ్చం 60 యేళ్ల క్రితం మద్రాస్ నగరం కొరకు జరిగిన ఆందోళనల్లో సీమాంధ్ర ప్రాంతంలో జరిగిన లూటీలు, విశాఖ ఉక్కు ఉద్యమంలో, జై ఆంధ్ర ఉద్యమంలో చెలరేగిన అల్లరిమూకలు చేసిన లూటీలు జ్ఞప్తికి వస్తున్నాయి.