mt_logo

భరోసా, సఖి కేంద్రాల్లో బాధిత మహిళలకు కౌన్సిలింగ్, లీగల్ సపోర్ట్: ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన భరోసా, సఖి కేంద్రాలను రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్  ఏడీజీ శిఖా గోయల్‌తో కలిసి రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..  మహిళా సంరక్షణ కోసం

సఖి భరోసా, వర్కింగ్ ఉమెన్ హాస్టల్ లతో పాటు బాల రక్ష భవన్ కేంద్రం కలిపి ఒకే చోట ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇక్కడ బాధిత మహళలకు వ్యక్తిగత గోప్యతతో పాటు కౌన్సిలింగ్ లీగల్ సపోర్ట్ తో కూడిన రక్షణ లభిస్తుందన్నారు. ఇలాంటి రక్షణ వ్యవస్థ ఉందని అందరికీ తెలిసేలా చర్యలు చేపడతామన్నారు. సీఎస్ఆర్ ద్వారా 1.8 కోట్ల రూపాయలతో నిర్మించిన్ గొవ్రో పెట్రో కెమికల్ వారికి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్  స్టూడెంట్ ఆకర్షణ లైబ్రెరీని అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. 

డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ..  సిద్దిపేటలో భరోసా, సఖి సెంటర్లు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.  2014లో ప్రారంభం చేసిన ఈ సెంటర్‌లు దేశానికే ఆదర్శమన్నారు. సీఎం కేసీఆర్ మహిళా భద్రత కోసం ఎంతో కృషి చేశారని అన్నారు.  

ఏడీజీ శిఖా గోయల్‌ మాట్లాడుతూ.. రాష్ట్రం మొత్తం షీ టీమ్స్ ఏర్పాటు చేసామని తెలిపారు. దేశంలో తెలంగాణలో మాత్రమే ప్రతి పోలీస్ స్టేషన్ లో మహిళా విభాగం కలిగి ఉందని స్పష్టం చేసారు.  తెలంగాణ రాష్ట్రం చిన్నారులు, మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించిందన్నారు. మహిళల అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి మహిళల అక్రమ రవాణా అరికడుతున్నామని తెలిపారు.