ఇరాక్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున 14 మంది తెలంగాణ ఖైదీలను విడుదల చేస్తూ ఇరాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవతో ఇరాక్ ప్రభుత్వం వారిని విడుదల చేసింది. బాధితులు ఈరోజు రాత్రి ఢిల్లీకి చేరుకోనున్నారు. అనంతరం ఢిల్లీ నుండి తెలగాణలోని తమ స్వస్థలాలకు చేరుకునేలా ఎంపీ కవిత అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదిలావుండగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో తెలంగాణ భవన్ అధికారులు ఇరాక్ నుండి వచ్చే ఖైదీలను రిసీవ్ చేసుకుని వారి స్వస్థలాలకు పంపనున్నారు. ఇరాక్ ఖైదీల విషయంలో ఎంపీ కవిత తీసుకున్న చొరవను వారి కుటుంబసభ్యులతో పాటు పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.