mt_logo

11వ విడత రైతు బంధు సంపూర్ణం.. రైతుల ఖాతాల్లోకి రూ. 7624 కోట్లు

  • 11వ విడతలో రూ. 7624.74 కోట్లు రైతుల ఖాతాల్లోకి
  • 68.99 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాలకు పంపిణీ

రైతుబంధు 11వ విడతలో భాగంగా రూ.7624.74 కోట్లు రైతుల ఖాతాల్లోకి తెలంగాణ ప్రభుత్వం జమ చేసింది. 68.99 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాలకు రైతు బంధు సాయం అందింది.

అత్యధికంగా నల్గొండ జిల్లాలో 5.08 లక్షల మంది రైతులకు రూ.609.67 కోట్లు జమ చేయడం జరిగింది. అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 35,879 మంది రైతులకు రూ.33.60 కోట్లు జమ చేయడం జరిగింది. ఈరోజుతో 11వ విడత రైతు బంధు కార్యక్రమాన్ని విజయవంతంగా తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది.

రైతు బంధు కింద 11 విడతల్లో మొత్తంగా ఇప్పటి వరకు రూ.72,815.09 కోట్లు నేరుగా రైతుల ఖాతాలలోకి తెలంగాణ ప్రభుత్వం జమ చేయడం జరిగింది. స్వతంత్ర భారత చరిత్రలో ఇది ఒక రికార్డు. దేశంలో ఉచిత కరెంటు, సాగునీళ్లు, రైతుబంధు, రైతుబీమా పథకాలతో పాటు వంద శాతం పంటలు కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే.