తెలంగాణ భవన్‌లో నిర్వహించిన చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే ఎందుకు భయమో.. దానికి అసలు కారణాన్ని రేవంత్ రెడ్డి ఈ మధ్యనే తన సన్నిహితులు వద్ద బయటపెట్టుకున్నారు అని తెలిపారు.
రేవంత్ రెడ్డి తదుపరి రాజకీయ మజిలీ బీజేపీనే.. త్వరలోనే రేవంత్ రెడ్డి బీజేపీలో తన బృందంతో చేరడం ఖాయం అని వ్యాఖ్యానించారు.
తాను పుట్టింది బీజేపీలోనే.. చివరికి బీజేపీలోనే తన రాజకీయ ప్రస్థానం ముగుస్తుందని ప్రధానమంత్రికి, అమిత్ షాలకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని.. తాను కాషాయ జెండాతోనే ఏబీవీపీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించానని.. అదే జెండా కప్పుకొని చనిపోతానని మోడీతో చెప్పింది వాస్తవమా కాదా రేవంత్ చెప్పాలి అని కేటీఆర్ అడిగారు.
ఈ అంశంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.