మంత్రి కొండా సురేఖ దిగజారుడు వ్యాఖ్యల అంశంలో తెలుగు సినీ పరిశ్రమతో ఛీ కొట్టించుకున్నది సరిపోనట్టు.. ఇప్పుడు ‘రేవంత్ సైన్యం’ టాలీవుడ్ అంతు చూస్తామంటూ వార్నింగ్‌లు ఇస్తూ రౌడీయిజం మొదలుపెట్టింది. సోషల్ మీడియా సాక్షిగా, బహిరంగంగానే సినీ నటులపై రేవంత్ సైన్యం బెదరింపులకు పాల్పడుతోంది.
ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ చేసిన జుగుప్సాకరమైన కామెంట్లపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ అంశాన్ని టాలీవుడ్ చాలా సీరియస్‌గా తీసుకుంది, సినీ పరిశ్రమకు చెందిన మహామహులందరూ సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
ఈ ఎపిసోడ్‌లో రేవంత్ సర్కార్ పరువు పూర్తిగా మూసీలో కలిసిపోవడంతో కాంగ్రెస్ సోషల్ మీడియా ఫ్రస్ట్రేషన్‌తో పిచ్చి ప్రేలాపనలు చేస్తుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలయ్యాక ఒక్కొక్కరి సంగతి చెబుతామంటూ బెదిరిస్తుంది.
నిజానికి టాలీవుడ్ చేసిందల్లా తోటి నటీనటులను సాక్షాత్తు ఒక మహిళా మంత్రి కించపరచడంపై ఖండన మాత్రమే. దానికే.. సదరు నటీనటులు ఏదో బీఆర్ఎస్‌కు మద్దతు పలికినట్లు రేవంత్ సైన్యం ఊగిపోతుంది.
ఇంత జరిగాక కూడా.. తాను చేసిన చిల్లర కామెంట్లను కొండా సురేఖ ఇంకా సమర్థించుకుంటుంటే.. రేవంత్ సైన్యం ఏమో ఇలా సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది.
చేసిన చిల్లర పనికి డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాల్సింది పోయి.. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇలా బహిరంగ బెదిరింపులకు పాల్పడటం విస్మయం కలిగిస్తోంది. అధికార పార్టీకి చెందిన వారు ఇలా అంతు చూస్తాం, సంగతి తెలుస్తాం అని రౌడీయిజం చేయడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి పరాకాష్ట.