mt_logo

రేవంత్ చేసిన అబద్ధపు ప్రచారాలు vs అసలు నిజాలు

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి అబద్ధపు ప్రచారాలతో పబ్బం గడుపుకుంటున్నట్లు పలు సందర్భాల్లో తేటతెల్లమైంది.

కొన్నిసార్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులకు క్రెడిట్ కొట్టేయడంలో భాగంగా, కొన్నిసార్లు కేసీఆర్ పాలనపై బురద చల్లాలని సీఎం, మంత్రులతో సహా కాంగ్రెస్ నాయకులు అబద్ధాలను, అర్ధ సత్యాలను అలవోకగా ప్రచారం చేశారు. వాస్తవాలను కప్పిపుచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు.

సీఎం రేవంత్ రెడ్డి చేసిన కొన్ని అబద్ధపు ప్రచారాలు, వాటికి సంబంధించిన అసలు నిజాలు మీకోసం:

❌ అబద్ధం: తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలు జరిగి 18 ఏళ్లు దాటింది

✅ నిజం: ఉపాధ్యాయుల సంఖ్యలో సమతుల్యతను పాటించేందుకు 2018లో 50,000 పైచిలుకు టీచర్ల బదిలీలు తెలంగాణలో జరిగాయి. భారీ ఎత్తున జరిగిన ఈ బదిలీ ప్రక్రియలో పారదర్శకత కోసం ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా నిర్వహించడం జరిగింది.

❌ అబద్ధం: సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి తెలంగాణ రాష్ట్రానికి రీజనల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్ట్‌ను సాధించారు.

✅ నిజం: ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 2018లో ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్‌కు తాత్కాలిక అనుమతులు కూడా మంజూరు చేసింది.

జూన్ 2021లో జాతీయ రహదారుల సంస్థ ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి సంబంధించిన డీపీఆర్ కోసం టెండర్‌లను జారీ చేసింది. తదనంతరం, భారతమాల పరియోజన స్కీంలో ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని చేర్చాలని అప్పటి సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

❌ అబద్ధం: ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు.. ఆగస్టు 15 నాటికి ప్రతి ఒక్కరికీ రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీని పూర్తి చేశాం.

✅ నిజం: బ్యాంకర్ల అంచనా ప్రకారం రైతు రుణమాఫీకి అవసరమైన సొమ్ము: రూ. 49,500 కోట్లు

రేవంత్ రెడ్డి అంచనా: రూ. 40,000 కోట్లు

రుణమాఫీ కోసం క్యాబినెట్ ఆమోదించిన మొత్తం: రూ. 31,000 కోట్లు

బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు: రూ. 26,000 కోట్లు

మూడు దశల్లో మాఫీ చేసిన మొత్తం: రూ. 17,933 కోట్లు

రుణమాఫీ జరగలేదని రోజురోజుకు రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. కానీ రేవంత్ మాత్రం అందరికి రుణమాఫీ అయిందని ప్రచారం చేసుకుంటున్నాడు.

❌ అబద్ధం: కేవలం 90 రోజుల్లో తెలంగాణ యువతకు 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం.

✅ నిజం: ఆ 30,000 ప్రభుత్వ ఉద్యోగాలన్నీ గత బీఆర్ఎస్ ప్రభుత్వమే నోటిఫై చేసింది.. అన్ని పరీక్షలు నిర్వహించింది. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ కూడా కేసీఆర్ హయాంలోనే జరిగింది. రేవంత్ ప్రభుత్వం చేసిందల్లా ఆ 30,000 ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలు ఇవ్వడమే.

ఇవి కేవలం మచ్చుకు కొన్ని.. ఇలా అబద్ధపు ప్రచారాలు చేసి జనాలను మభ్యపెట్టాలని కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు కోకొల్లలు.