mt_logo

తెలంగాణ ముద్దుబిడ్డ రాహుల్ సిప్లిగంజ్ ను అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్, మే 30: సీఎం కప్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో భాగంగా హైదరాబాద్ లోని  లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహించిన క్రీడా సంబరాలలో ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా అస్కార్ అవార్డు సాదించిన తెలంగాణ ముద్దుబిడ్డ రాహుల్ సిప్లిగంజ్ పాల్గోని క్రీడాకారులకు తన పాటలతో ఇన్స్పిరేషన్ కలిగించిన సంధర్బంగా రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. 

ఈ సంధర్బంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి సూచనల మేరకు తెలంగాణ క్రీడా శాఖ ఆధ్వర్యంలో దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి, దేశానికి సరిపడా క్రీడాకారులను అందించాలని లక్ష్యంతో..,మొట్టమొదటి సారిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం కప్ ను నిర్వహిస్తున్నామన్నారు. సీఎం కప్ ను మండల, జిల్లా స్థాయి లలో ఎంతో ఘనంగా నిర్వహించామన్నారు. 

 సీఎం కప్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో 33 జిల్లాల నుండి ఎంపికైన సుమారు 6 వేల మంది క్రీడాకారులు 18 క్రీడాంశాలలో హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల గుర్తింపు పొందిన 6 క్రీడా స్టేడియాలలో నేడు జరుగుతున్నా సెమీఫైనల్, రేపు జరిగే ఫైనల్ మ్యాచ్ లను, సీఎం కప్ ముగింపు కార్యక్రమాలను వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఎంతో సమర్థవంతంగా, విజయవంతంగా నిర్వహించాలని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.