
లగచర్ల ఘటనను బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్ళారు. ఈ విషయంపై.. బాధితుల కోసం రాష్ట్రపతి అపాయింట్మెంట్‌ను బీఆర్ఎస్ పార్టీ నేతలు కోరారు.
దానికి స్పందిస్తూ.. లగచర్లలో గిరిజనులపై జరిగిన అణిచివేత తాలుకు సమాచారాన్ని రాష్ట్రపతి కార్యాలయ అధికారులు కోరారు. లగచర్లలో బలవంతపు భూసేకరణ ఘటనను, పోలీసులు చేసిన దుర్మార్గపు దాడులను, లైంగిక దాడి వంటి అంశాలను రాష్ట్రపతి కార్యాలయానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందచేశారు.
ఇప్పటికే లగచర్లలో గిరిజన కుటుంబాలపై జరిగిన దాడులు, అక్రమ అరెస్ట్‌లపై ఎస్సీ, ఎస్టీ, మహిళ, మానవహక్కుల కమీషన్‌లను కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై బాధితులు ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతిని కలసి వారి గోడు వినిపించే వరకు ఢిల్లీలోనే ఉంటాం అంటున్న గిరిజన మహిళలు స్పష్టం చేశారు.