mt_logo

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యత: మంత్రి కేటీఆర్

  • తంగళ్ళపల్లి మండలం జిల్లెల చెక్ పోస్ట్  నుండి  సిరిసిల్ల, అగ్రహారం,నంది కామన్, వెంకట్రావుపల్లి బోర్డర్  వరకు ప్రధాన రహదారి వెంబడి సింగరేణి వారి సహకారంతో ఏర్పాటు చేసిన 80 సీసీటీవీ  కెమెరాలను ప్రారంభించిన మంత్రి
  • జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రంను బుధవారం మంత్రి ప్రారంభించారు.

రాజన్న సిరిసిల్ల,జాన్ 14: సిరిసిల్ల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, సిరిసిల్ల పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ కెమెరాలు పోలీస్ కార్యాలయంలోని తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ద్వార కమాండ్ కంట్రోల్  సెంటర్ కు అనుసంధానం చేసారు..  ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలోనే అత్యుత్తమ పోలీసింగ్‌ సేవలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని మంత్రి గారు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి నాయకత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ లో కమాండ్ కంట్రోల్  కేంద్రం ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఏ మూలన ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా కనిపెట్టే పరిస్థితులు వున్నాయని, పోలీసుల ఆత్మగౌరవం పెరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తున్నది అన్నారు. ప్రజల ధన మాన ప్రాణ రక్షణనే ద్యేయంగా పోలీసులు విధులు నిర్వహించడం జరుగుతుందని, రాష్ట్రంలో పటిష్ట శాంతిభద్రతల కారణంగా రాష్ట్రానికి కొత్త పెట్టుబడులతో పాటు, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని తెలిపారు.

జిల్లాలో నేరాల నియంత్రణ కోసం వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు,సిరిసిల్ల పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ కెమెరాలు,నూతనంగా సింగరేణి వారి సహకారంతో తంగాలపల్లి మండలం జిల్లెల చెక్ పోస్ట్ నుండి సిరిసిల్ల, అగ్రహారం, నంది కామన్,వెంకట్రావుపల్లి బార్డర్ వరకు ఏర్పాటు చేసిన  సీసీ కెమెరాలని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేయడం జరిగిందని,కమాండ్ కంట్రోల్ ద్వారా జిల్లాలో ఎలాంటి సంఘటనలు జరిగినా సీసీ కెమెరాల ద్వారా గుర్తించవచ్చు అన్నారు.