mt_logo

ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. 5% ఐఆర్ ప్రకటన.. త్వరలో కొత్త పీఆర్సీ

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్ చెల్లింపు కోసం పే రివిజన్ కమిటీని ( పీఆర్సీ) నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ చైర్మన్ గా ఎన్. శివశంకర్ (రిటైర్డ్ ఐఏఎస్) ను , సభ్యునిగా బి. రామయ్య (రిటైర్డ్ ఐఏఎస్) ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ 6 నెల్లలోపు నివేదికను ప్రభుత్వానికి అందచేయాలని ఉత్తర్వుల్లో సూచించింది. పీఆర్సీకి బాధ్యతలు నిర్వర్తించేందుకు కావాల్సిన నిధులను, స్టాఫ్‌ను ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించింది. 5% మధ్యంతర భృతి (ఐఆర్) ను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు  చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.