mt_logo

కాంగ్రెస్‌కి రైతుల ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం: కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మరోసారి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం మరియు రైతుల ప్రయోజనం కంటే రాజకీయమే ముఖ్యం అని తేలిపోయింది అని విమర్శించారు.

మేడిగడ్డ దగ్గర కాఫర్ డాం కట్టి, మరమత్తులు చేసి, నీళ్లు ఎత్తిపోసి రైతులను ఆదుకోమని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు, డిపార్ట్మెంట్ ఇంజినీర్లు చెయ్యాలి అని రిపోర్ట్ ఇచ్చిన తరువాత, కడతాం అని కూడా ఎల్ అండ్ టీ కెంపెనీ ముందుకు ఒచ్చింది అని తెలిపారు

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కుత్సితమైన చిల్లర రాజకీయం చేస్తూ, రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతూ, కేసీఆర్‌ను బద్నాం చెయ్యాలనే ఒకే ఒక అజెండాతో కాఫర్ డాం కట్టకుండా రైతులని నిండా ముంచాలని చూస్తుంది అని దుయ్యబట్టారు.

ఇంత నికృష్ట రాజకీయం కేవలం ఎన్నికలలో లాభం కోసమేనా అని కాంగ్రెస్ పార్టీని కేటీఆర్ ప్రశ్నించా