జర్నలిస్టుల సమస్యలన్నీ త్వరలో పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఒకేసారి ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నామని, ఈ ప్రక్రియ తుది దశలో ఉందని ఆయన తెలిపారు. ఇవాళ తనను కలిసిన జర్నలిస్టులతో, వాళ్ల సమస్యలపై కేటీఆర్ చర్చించారు.
కొత్తగా ఏర్పాటైన ది తెలంగాణ జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఏర్పాటైన సమాచారం తమకు తెలుసని వ్యాఖ్యానించారు. సొసైటీ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లి సభ్యత్వాలను ఖరారు చేసి సిద్ధంగా ఉండాలని సూచించారు. జర్నలిస్టులందరికీ పెన్షన్ సదుపాయాన్ని కూడా కల్పించేందుకు కసరత్తు చేస్తున్నామని, దీనిపై త్వరలో తుదిరూపు వస్తుందని అన్నారు.