mt_logo

350 కోట్లతో నిర్మిస్తున్న రిజర్వాయర్ల ద్వారా 22,000 ఎకరాలకు సాగునీరు

  • రూ.150 కోట్ల తో నిర్మిస్తున్న చందూర్, జాకో, చింతకుంట లిఫ్ట్ పనులు
  • రూ. 200 కోట్లతో  కొనసాగుతున్న సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు

మోస్రా మండలం గోవూరు, చింతకుంట గ్రామాల్లో ఈరోజు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా గోవూర్ లో కాకతీయ కళా తోరణాన్ని ప్రారంభించారు మరియు చింతకుంట ఎత్తిపోతల పథకం పంప్ హౌజ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం చింతకుంట గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతకుంట లో జరిగిన గ్రామ సభలో స్పీకర్ పోచారం గారు మాట్లాడుతూ… బాన్సువాడ నియోజకవర్గంలో నిజాంసాగర్ ప్రాజెక్టుపై ఆయకట్టు లో లక్ష ఎకరాలు ఆధారపడ్డాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్ నుండి నిజాంసాగర్ లో పడేలా చేసిన ఘనత కేసీఆర్ దే అన్నారు. రూ.  150 కోట్లతో నిర్మిస్తున్న చందూర్, జాకో, చింతకుంట లిఫ్ట్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి.

10 వేల ఎకరాలకు సాగునీరు

ఈ పథకం ద్వారా 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. రూ. 200 కోట్లతో సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీని ద్వారా మరో 12,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. బాన్సువాడ నియోజకవర్గంలో ప్రతి గుంటకు సాగు నీరందించేలా పనులు చేస్తున్నామన్నారు. వ్యవసాయ దారుడు బాగుంటేనే ప్రపంచానికి అన్నం. రైతు నాగలి నెలలో పెడితేనే ప్రపంచంలో అందరికీ తిండి,  ఐదు వెళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి. రైతన్న తలెత్తుకుని బతికేలా చేస్తున్న ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

11,000 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం

రైతు బంధు, రైతు బీమా,24 గంటల ఉచిత కరెంట్ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవు. కల్యాణలక్ష్మి పథకం, బస్తీ దవాఖాన, కేసీఆర్ కిట్, గురుకుల పాఠశాలలు ఇలా చెబుతా ఉంటే చాలా వున్నాయి. గర్భిణీలకు అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం పెట్టడంతో పాటుగా అన్ని పోషకాలతో కూడిన న్యూట్రీషన్  కిట్ ను అందజేస్తున్నారు. ఏ రాష్టంలో లేని విధంగా ఇలా అందజేస్తున్నాం. బాన్సువాడ నియోజకవర్గంలో రాష్ట్రంలో అత్యధికంగా 11,000 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా  తెలంగాణ రాష్ట్రంలో రూ. 2000 పింఛన్ ఇస్తున్నారు. ఖమ్మం సభలో నిన్న రాహుల్ గాంధీ రూ. 4 వేలు ఇస్తా అని ప్రజలకు మాయ మాటలు చెబుతున్నారు. మొదట కాంగ్రెస్ పాలించే రాష్ట్రాల్లో ఇవ్వండి తర్వాత తెలంగాణలో ఇద్దురు గానీ అన్నారు రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి.