ప్రచార భాద్యతతో “లండన్ ఇన్‌ఛార్జ్ – రత్నాకర్ కడుదుల” రేపు తెలంగాణకు ప్రయాణం, ప్రాచారానికి ప్రత్యేక కమిటీ.
ఈ నెల 6 వ తేదీన జరుగనున్న వరంగల్ మరియు ఖమ్మం మున్సిపల్ ఎలక్షన్లో NRI TRS – UK సభ్యులు ఒక బృందంగా వెళ్లి ప్రచారం చేయాలనీ నిర్ణయించినట్టు అధికార ప్రతినిది శ్రీకాంత్ జెల్ల తెలిపారు.
లండన్ ఇన్‌చార్జ్ రత్నాకర్ కడుదుల అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రత్యేకించిన కమిటీ వేస్తున్నట్టు ప్రకటించారు, ఈ కమిటీలో వరంగల్ మరియు ఖమ్మంకు చెందిన సభ్యులు ఉంటారని, ఈ కమిటీకి ఇన్‌చార్జిగా రత్నాకర్ కడుదుల వ్యవహరిస్తారని తానే క్షేత్రస్తాయిలో పర్యటించి ప్రచార భాద్యతలు చూసుకుంటారని, కో ఆర్డినేటర్ గా సృజన్ రెడ్డి చాడ ఉంటారని అధ్యక్షులు అనిల్ కూర్మాచలం తెలిపారు.
ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ, వరంగల్, ఖమ్మం మరియు అచ్చంపెటలో గులాబీ జెండా ఎగరడం కాయమని కానీ బాద్యత గల టి.ఆర్.ఎస్ కార్యకర్తలుగా మా వంతు భాద్యత నిర్వహించడానికి బృందంగా వెళ్తున్నామని, కే.సీ.ఆర్ గారి నాయకత్వాన్ని బలపర్చడం ఇప్పుడు చారిత్రాత్మక అవసరమని, కాబట్టి ఎలాగైతే నాటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నుండి నేటి బంగారు తెలంగాణ పునర్నిర్మాణం వరకు కే.సీ.ఆర్ గారి వెంట ఉన్నామో, ఇక భవిష్యత్తులో కూడా సందర్భం ఏదైన, వారి వెంటే ఉంటామని తెలిపారు.
కమిటీ సభ్యుల వివరాలు: రత్నాకర్ కడుదుల(ఇన్‌చార్జ్), సృజన్ రెడ్డి చాడ (కొ ఆర్డినేటర్ & సోషల్ మీడియా ఇన్‌చార్జ్), రాజ్‌కుమార్ శాణబోయిన, సునీల్ రెడ్డి మందా, వినయ్ ఆకుల, శ్రీధర్ రావు తక్కలపల్లి, విక్రమ్ రెడ్డి రేకుల, మల్లేశ్, ప్రవీణ్ సుభాష్ ఉన్నారు.
NRI TRS CELL సెక్రటరీ నవీన్ రెడ్డి మరియు సతీష్ రెడ్డి బండ సమన్వయ కర్తలుగా వ్యవహరిస్తారు.