mt_logo

లండన్‌ NRI TRS ఆధ్వర్యంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

– 63 వ పుట్టినరోజు సందర్భంగా 63 రకాల పూలతో ప్రత్యేక పూజలు

ఎన్నారై టి.ఆర్.యస్ యుకె శాఖ ఆధ్వర్యంలో లండన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్సి రావు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్నారై టి.ఆర్.యస్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మరియు వారి సతీమణి ప్రభలత కూర్మాచలం సాంప్రదాయబద్దంగా కార్యక్రమాన్ని ముందుండి నిర్వహించారు.

లండన్ ఇన్‌చార్జ్ సతీష్ రెడ్డి బండ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కెసిఆర్ గారు 63 వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా, వివిధ ప్రదేశాల నుండి సేకరించిన 63 రకాల పువ్వులతో వెస్ట్ లండన్ లోని ప్రసిద్ధ దుర్గా దేవి అమ్మ వారి దేవాలయం లో కార్యవర్గ సభ్యులు కుటుంబ సమేతంగా కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కెసిఆర్ గారు ఎల్లప్పుడూ ఆరోగ్యాంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా నిర్మించే క్రమంలో భగవంతుడు వారికి అన్ని సందర్భాల్లో మనోధైర్యాన్ని, ఆశీస్సులు అందించి ముందుకు నడిపియ్యాలని వారంతా కోరుకున్నారు.

ఆలయ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి, కెసిఆర్ గారు ఎక్కడున్నా దీర్ఘాయిషులవ్వాలని, తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని దీవించారు. వారి నాయకుడి పట్ల, మాతృభూమి పై వారికున్న ప్రేమను చూసి, పండితులు హర్షం వ్యక్తం చేసి, ఇప్పటివరకు అమ్మవారికి ఒకేసారి 63 రకాల పూలతో పూజ చేయడం ఇదే మొదటి సారని, వీరి ఆలోచనను అభినందించి సభ్యులందరినీ ఆశీర్వదించారు.

పూజ అనంతరం అదే రోజు సాయంత్రం ఏర్పాటు చేసిన వేడుకల్లో, కేక్ కట్ చేసి కెసిఆర్ గారికి శుభాకాంక్షలు తెలిపి, ఎన్నో సంవత్సరాలుగా లండన్ లో కెసిఆర్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నామని, కానీ ఈ సంవత్సరం ప్రత్యేక పూజలు చేసి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

లండన్ లో వేడుకలే కాకుండా ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రం లో పలు సేవా కార్యక్రమాలు చేస్తామని, ఈ సంవత్సరం కూడా వరంగల్ లో “రక్తదాన శిబిరం” ఏర్పాటు చేశామని కార్యదర్శి సృజన రెడ్డి చాడ తెలిపారు.

చివరిగా లండన్ ఇన్‌చార్జ్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ, ఒక రోజంతా ఇలా వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని, బంగారు తెలంగాణ నిర్మాణం లో కెసిఆర్ గారి వెంటే ఉంటామని, హాజరైన కార్యవర్గ సభ్యులందరికి, ప్రత్యేకంగా పూల సేకరణకు కృషి చేసిన అశోక్ దూసరి మరియు రత్నాకర్ కడుదుల గార్లకు కృతఙ్ఞతలు తెలిపారు.

ఈ వేడుకల్లో ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ అధ్యక్షులు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు అశోక్ దూసరి, నవీన్ రెడ్డి, శ్రీకాంత్ పెద్దిరాజు, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైసర్ బోర్డు సభ్యులు దొంతుల వెంకట్ రెడ్డి, సత్యం రెడ్డి కంది, సెక్రటరీ సృజన్ రెడ్డి, మీడియా ఇన్‌చార్జ్ శ్రీకాంత్ జెల్ల, యూకే & ఈయూ ఇన్‌చార్జ్ విక్రమ్ రెడ్డి, IT సెక్రటరీ వినయ్ ఆకుల, లండన్ ఇన్‌చార్జ్ సతీష్ రెడ్డి బండ, ఈస్ట్ లండన్ కో-ఆర్డినేటర్ రమేష్ యెసంపల్లి, నవీన్ మాదిరెడ్డి, ఈవెంట్స్ కో-ఆర్డినేటర్స్ రవి ప్రదీప్, వెస్ట్ లండన్ ఇన్‌చార్జ్ గణేష్ పాస్తం, సురేష్ బుడగం, మెంబర్ షిప్ ఇన్‌చార్జ్ రాకేష్ రెడ్డి కీసర మరియు ముఖ్య సభ్యులు రవి కుమార్ రత్తినేని, అశోక్ కుమార్ అంతగిరి మరియు టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది, టాక్ సభ్యులు స్వాతి బుడగం, మట్టా రెడ్డి, శ్రీనివాస్ యాదవ్ మేకల తదితరులు హాజరైన వారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *