mt_logo

సీఎం కేసీఆర్ పెయింటింగ్స్ ప్ర‌దర్శ‌న‌ ప్రారంభం

ముఖ్య‌మంత్రి శ్రీ క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు జ‌న్మ‌దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని శుక్ర‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో కేసీఆర్ పెయింటింగ్స్ ఎగ్జిబిష‌న్‌ను నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత‌ ప్రారంభించారు. హైద‌రాబాద్ జెఎన్‌టియు ఫైన్ ఆర్ట్స్ యూనివ‌ర్సిటీలో చ‌దివిన విక్రం రాజ్ కేసీఆర్ జీవితం, ఉద్య‌మం, రాజ‌కీయ ప్ర‌స్థానాల‌ను తెలియ‌జేసేలా ఆరు నెల‌లు క‌ష్ట‌ప‌డి కాన్వాస్ పై పెయింటింగ్స్‌ను వేశారు.

తెలంగాణ జాగృతి కోసం అప‌ర‌భ‌గీర‌థుడు కేసీఆర్ అంటూ సీఎం గురించి తెలిపే ప్లెక్సీ కార్య‌క‌ర్త‌ల‌ను మ‌రోసారి కార్యోన్ముఖుల‌ను చేసింది. మూడు రోజుల పాటు ఈ పెయింటింగ్స్‌ను తెలంగాణ భ‌వ‌న్‌లో సంద‌ర్శ‌కులు, కార్య‌క‌ర్త‌లు చూడ‌వ‌చ్చు.

ఈ సంద‌ర్భంగా ఎంపి క‌విత మాట్లాడుతూ విక్రం రాజ్ గొప్ప చిత్ర‌కారుడ‌ని ప్ర‌శంసించారు. సీఎం కేసీఆర్ పెయింటింగ్స్‌ను చూస్తుంటే…నాటి దృశ్యాలు క‌ళ్లముందు మెదులుతున్నాయ‌న్నారు. మొత్తం పెయింటింగ్స్‌ను తాను తీసుకుంటాన‌ని తెలిపారు. సీఎం కేసీఆర్ గారి బంగారు తెలంగాణ‌ను సాధన‌కు పున‌రంకితుల‌మ‌వుదామ‌ని క‌విత పిలుపునిచ్చారు.

డిప్యూటీ సీఎం మ‌హ‌మూద్ అలీ, హోంమంత్రి నాయ‌ని న‌ర్సింహారెడ్డి, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, డిప్యూటీ మేయ‌ర్ బాబా ఫ‌సియోద్దీన్‌, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మ‌న్ డాక్ట‌ర్ ఆయాచితం శ్రీధ‌ర్‌, ఆగ్రోస్ ఛైర్మ‌న్ లింగంప‌ల్లి కిష‌న్ రావులు కేసీఆర్ పెయింటింగ్స్‌ను తిల‌కించారు. విజిట‌ర్స్ బుక్‌లో త‌మ అభిప్రాయాల‌ను రాశారు.

ఆనందోత్సాహాల‌తో కేక్ క‌టింగ్‌
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుక‌ల్లో భాగంగా తెలంగాణ భవన్‌లో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ కవిత, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్ధీన్ లు కేక్ క‌ట్ చేశారు.

అనంతరం ఎపీ కవిత మాట్లాడుతూ… కేసీఆర్ జన్మదిన వేడుకలు తెలంగాణ భవన్‌లో జరుపుకోవడం అనవాయితీగా వస్తోంది. కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ… కేసీఆర్, అమరుల త్యాగమే తెలంగాణ రాష్ట్రమన్నారు. ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారు. ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేరని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *