సోమవారం నాంపల్లిలోని గృహకల్ప ప్రాంగణంలో జరిగిన తెలంగాణ క్రైస్తవ జేఏసీ సమావేశంలో జేఏసీ చైర్మన్ కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని, అలా చేస్తే సీమాంధ్రులకు గట్టి గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు. ఇప్పటికే విభజన ప్రక్రియ తుది దశకు చేరుకుందని, ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు సృష్టించినా వెనక్కిపోదని స్పష్టం చేశారు. తెలంగాణ అడ్డుకునే ముఖ్య నాయకుడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పట్ల విషం చిమ్ముతున్నాడని, ఎంత ఆపుదామని చూసినా తెలంగాణ ఆపే శక్తి సీఎంకు లేదని కోదండరాం అన్నారు. సీమాంధ్రులు సరైన వాదనలు వినిపించకుండా అసెంబ్లీలో చర్చను అడ్డుకుంటున్నారని, ఇది అర్థంపర్థం లేని మూర్ఖత్వపు చర్య అని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. బిల్లుపై సవరణలు చేసి పార్లమెంటులో ప్రవేశబెట్టాలని, సంపూర్ణ తెలంగాణ సాధించేవరకు అప్రమత్తంగా ఉండాలని కోదండరాం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం అధ్యక్షుడు వీ శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ క్రైస్తవ జేఏసీ అధ్యక్షుడు రవికుమార్ా ల్ తదితరులు పాల్గొన్నారు.
- Despite heavy rains, 35% of tanks in Telangana remain empty
- Will Congress govt. proceed with local body polls without 42% BC reservation?
- Is Revanth using HYDRAA to threaten ministers? Issue reaches Congress high command
- Additional surcharge on electricity leaves Telangana industries in a bind
- 400 secret GOs in Municipal dept: Is Congress govt. hiding vital information from public?
- రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- రైతులు ఆత్మహత్యలు చేసుకోవొద్దు.. కలిసి పోరాడుదాం: హరీష్ రావు పిలుపు
- తెలంగాణ సంబురాల పేరుతో తెలంగాణవాదులను జిట్టా ఏకం చేశాడు: హరీష్ రావు
- ఆస్తులను లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమ నిర్మాణానికి జిట్టా కృషి చేశారు: కేటీఆర్
- జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపిన కేసీఆర్
- కాంగ్రెస్ పాలనలో అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయి: హరీష్ రావు
- తెలంగాణ ఉద్యమకారుడు కొణతం దిలీప్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేసినట్లు?
- దొడ్డిదారిన ఆర్డినెన్స్ తెచ్చి గ్రామాలను మున్సిపాలిటీల్లో కలపడమేంటి: ఎమ్మెల్యే వివేకానంద
- దిలీప్ కొణతం అరెస్టును ఖండించిన కేటీఆర్
- కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే జైనూర్ ఘటన: కేటీఆర్