mt_logo

ఆదిలాబాద్‌లో ఎన్‌డీబీఎస్‌ ఐటీ కంపెనీ ఏర్పాటు : మంత్రి కేటీఆర్

త్వరలోనే ఆదిలాబాద్ లో ఐటీ టవర్ తో పాటు, టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని తెలియజేసారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. ఆదిలాబాద్ లో ఎన్‌డీబీఎస్‌ ఐటీ కంపెనీ ఏర్పాటుకు ఆ కంపెనీ ఎండీ సంజీవ్ దేశ్ పాండే ముందుకు వచ్చారని వెల్లడించారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ పరిశ్రమను విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. అలాగే ఆదివాసీ రైతులు సాగుచేసుకుంటున్న అటవీ భూములపై హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని పేర్కొన్నారు. బుధవారం టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఆదివాసీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్ ను ప్రగతి భావం లో కలిసి తమ సమస్యలు విన్నవించుకోగా, త్వరలోనే ఆదివాసీ ప్రజాప్రతినిధులు, అటవీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆదిలాబాద్ లో సీసీఐ ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించాలని మంత్రి జోగురామన్న తదితర ప్రజాప్రతినిధుల బృందం కేటీఆర్ ను కలవగా… ఈ విషయంపై కేంద్రానికి ఎన్నోసార్లు విన్నవించామని, అయినా కేంద్రం నుండి ఎలాంటి స్పందన రాలేదని అన్నారు. మరోసారి సీసీఐ పునఃప్రారంభం గురించి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఒకవేళ కేంద్రం స్పందించకపోతే పోరాడి మరీ సాధించుకుందామని కేటీఆర్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *