ఎమ్మెల్సీ కవితను జాతీయ మీడియా ప్రశంసలతో ముంచెత్తింది. దేశంలో మహిళా బిల్లు చర్చకు తీసుకొచ్చిన ఘనత ఖచ్చితంగా ఎమ్మెల్సీ కవితకే దక్కిందని జాతీయ మీడియా తెలిపింది. మహిళా బిల్లుపై దేశవ్యాప్త చర్చకు కవిత జంతర్ మంతర్ దీక్ష దారి తీసిందన్నారు.
జంతర్ మంతర్ వద్ద కవిత చేసిన దీక్ష యావత్ దేశాన్ని మహిళా బిల్లుపై చర్చించే పరిస్థితి కల్పించిందన్నారు. మహిళలకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వరని, మహిళలపై గౌరవం ఉంటే రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని అని గర్జించిన ఘనత కవితదే అని తెలిపారు. దీక్ష ద్వారా మహిళా బిల్లుకు పలు ముఖ్యమైన పార్టీల మద్దతు కవిత కూడగట్టిందని పొగిడారు.