Mission Telangana

MTTA ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు

ఉత్తర కాలిఫోర్నియాలో మౌంటెన్ హౌస్ ట్రేసీ తెలుగు సంఘం (MTTA) ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి. సుసాన్ ఎఙ్గమం (అసెంబ్లీ మెంబెర్ 13th డిస్ట్రిక్ట్), బాబ్ ఇలియట్ (సూపర్వైజర్ / వైస్ చైర్మెన్ జోఅక్విన్ కౌంటీ), రాబర్ట్ రిక్ మాన్ (ట్రేసీ కౌన్సిల్ మెంబెర్), బ్రెయిన్ లుచిద్ (MHCSD బోర్డు ప్రెసిడెంట్), బెర్నీస్ ట్రీంగ్లె (MHCSD బోర్డు వైస్ ప్రెసిడెంట్) ముఖ్య అతిథిలుగా విచ్చేసి కార్యక్రమనానికి ప్రత్యేకతను చేకూర్చారు.

శోభారాజు గారి శిష్యురాలు, శ్రీమతి వల్లి మోచర్ల గారు ఆలపించిన శ్రీ గణేశాయ ధీమహి భక్తి గీతంతో 5 గంటల కార్యక్రమానికి తెరలేచింది. మౌoటేన్ హౌస్ లోని “బెథానీ స్కూల్ మల్టిపోరోస్ రూమ్” లో జరిగిన ఈ ఉత్సవాలకు మౌoటేన్ హౌస్ లోని భారతీయూలందరు సాంప్రదాయ దుస్తులు ధరించి ఆట పాట లతో అందరిని అలరించారు. ఈ కార్యక్రమానికి ప్రమిత్ షా, మరియు త్రిప్తి ఘటాది వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. పండగ సందర్భంగా నోరూరుంచే పలు రుచుల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేసారు.

MTTA కార్యనిర్వాహక సంఘం విచ్చేసిన ముఖ్య అతిధులను, ఇండియా నుంచి విచ్చేసిన, 1995 లో రాష్ట్రపతి శ్రీ శంకర్ దయాల్ శర్మ చేతులుమీదగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీ గొడవర్తి పనసరమన్న మరియు ఆల్టర్నేట్ థెరపీ లో సేవలు అందిస్తున్న డాక్టర్ సునీత పటేల్, ప్రవీణ్ పటేల్ లను ఘనంగా సత్కరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *