mt_logo

ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు బిడ్డా –  ఏపీ మంత్రి బొత్స కి ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ వార్నింగ్

ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు బిడ్డా.. అంటూ బొత్స సత్యనారాయణ పై మండి  పడ్డారు ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌. తెలంగాణ రాష్ట్రం పై బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు ఖండిస్తూ.. ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ఈ రోజు  సచివాలయం మీడియా సెంటర్ లో ఏర్పాటు చేసిన  మీడియా సమావేశంలో మాట్లాడారు… తెలంగాణ రాష్ట్రం పై మాట్లాడేటప్పుడు కొంచెం అయిన ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి బొత్స సత్యనారాయణ అని హెచ్చరించారు. మీరు మొగోళ్ళు అయితే వారాంతంకు హైదరాబాద్ రాకుండా ఉంటారా? అని ప్రశ్నించారు. మీకు చీము నెత్తురు ఉంటే మీ రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉందో చెప్తారా…ఆ దమ్ముందా నీకు అని అడిగారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం పై దండయాత్ర చేసి దోచుకున్నది మీరు, మా ప్రాంతంలో ఉన్న వనరులను దోచుకున్నది మీరు తెలంగాణ రాష్ట్రం పై మాట్లాడే నైతిక హక్కు లేదు.ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్సీని చీ పీపీఎస్సీ  అని మీడియా, వార్త పత్రికలు రాసిన వార్తలు మర్చిపోయావా?  అని ప్రశ్నించారు.  మీరు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో నువ్వు మంత్రివి ఎన్ని గురుకుల పాఠశాలలు ఉండే, ఎన్ని డిగ్రీ కాలేజ్ లు ఉండే…మీ పాలన లో 60 ఏండ్ల కాలంలో ఒక్క మెడికల్ కాలేజ్ కట్టలేదు ఎందుకు మరి అని అడిగారు.  మీరు రాజకీయ విమర్శలు చేస్తే మీ ఆంధ్ర రాష్ట్రంలో చేస్కో కానీ తెలంగాణ గురించి మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. నీవు ఇలానే మాట్లాడితే నిన్ను హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో నిన్ను దిగనివ్వం జాగ్రత్త అని హెచ్చరించారు. 

తెలంగాణ సమాజం పైన సీఎం కేసీఆర్ పైన మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు జాగ్రత్త బిడ్డా..  బొత్స సత్యనారాయణ, ఏపీ ప్రభుత్వం లో ఇంజనీరింగ్ విద్య బాగాలేదని తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య కోసం ఇక్కడకు ఏపీ విద్యార్థులు 80 వేల మంది ఇక్కడ చదువుతున్నారు.మీకు ఇప్పటికి రాజధాని దిక్కు లేదు అందుకే తెలంగాణ వైపు మీ రాష్ట్ర విద్యార్థులు వస్తున్నారని గుర్తు చేసారు.