
బట్టేబాజ్ ఆల్ ఇండియా సంఘం కు ఎంపీ అరవింద్ ను జాతీయ అధ్యక్షుడు చేస్తే బాగుంటుంది. ఎన్నికల ముందు పసుపు బోర్డు ఇస్తామని బాండ్ పేపర్ రాసిచ్చిన వ్యక్తి అరవింద్ ఇప్పటికి పసుపు బోర్డు దిక్కు లేదని గుర్తు చేసారు ఎంఎస్‌ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్. ఈ రోజు సచివాలయం మీడియా సెంటర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… అరవింద్ నిజామాబాద్ ప్రజలకు నీవు ఎంపీ అయ్యి ఏం చేశావ్? అని ప్రశ్నించారు. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. ఏది పసుపు బోర్డు… అందుకే వాన్ని బట్టేబాజ్ అంటారు…. వాన్ని ఆ సంఘం కు జాతీయ అధ్యక్షుడు చేయాలని అంటున్నా … మన దేశంలో 157 మెడికల్ కాలేజ్ లు ఇచ్చారు ఒక్కటి అయిన తెలంగాణ రాష్ట్రంకు, నిజామాబాద్ కు కావాలని అడిగినవా?
హరిశ్ రావు మీద మాట్లాడే వ్యక్తివా? నువ్వు ….అంత దమ్ము ఉందా?
హరీష్ రావు పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉరికిచ్చి కొడుతారు ఒళ్ళు జాగ్రత్త బిడ్డా అరవింద్. నాడు నేను పోను బిడ్డా సర్కర్ దవాఖానకు అనే సామెత నుండి నేడు నేను సర్కారు దవాఖానకు పోత అనే దగ్గరకు వచ్చింది తెలంగాణ. వైద్య రంగానికి ఎంతో చేస్తున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు పై , వైద్య ఆరోగ్య శాఖ పై పిచ్చి పిచ్చి మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు.
