mt_logo

దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసే కుట్రలో మోడీ సర్కార్ : మంత్రి జగదీష్ రెడ్డి

 2,000 నోట్ల రద్దు పై రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రతిస్పందన

  • మోడీ ప్రభుత్వ తిరోగమనానికి నోట్ల రద్దు పరాకాష్ట
  • దేశాభివృద్ధికి ఎంత మాత్రం దోహద పడని చర్య
  • ఆర్థికంగా దేశాన్ని దెబ్బతీసే కుట్ర
  • పెట్టుబడి దారుల రహస్య ఎజెండా లో  భాగమే
  • ఎందుకు తెచ్చారో… ఎందుకు రద్దు చేశారో
  • ఉపయోగం లేదనుకున్నప్పుడు 2,000 నోట్లు ఎందుకు తెచ్చారు 
  • ఏమి ఆశించి ఈ చర్యకు ఉపక్రమించారు
  • అంతర్గతంగా ఉన్న రహస్య ఎజెండా ను బహిర్గతం చెయ్యాలి 
  • నోట్ల రద్దుతో ప్రయోజనం ఉంటే ఎందుకు వివరించడం లేదు
  • ఆర్బిఐ ని ముందు పెట్టి ప్రజల కళ్ళు గప్పే ప్రయత్నం
  • దేశంలో బీజేపీ పతనం మొదలైంది
  • ప్రజల కోసం కాకుండ కొంతమంది ప్రయోజనానికే  మోడీ ప్రాధాన్యత

సూర్యాపేట: నోట్ల రద్దుతో కేంద్రంలో మోదీ పాలనకు తిరోగమనం మొదలైందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇది దేశాభివృద్ధికి ఎంత మాత్రం దోహదపడదని ఆయన తేల్చి చెప్పారు. ఈ మేరకు శనివారం ఉదయం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియా తో మాట్లాడుతూ నోట్ల రద్దు పై స్పందించారు. ఆర్థికంగా దేశాన్ని దెబ్బతీసే కుట్రలో మోడీ సర్కార్ పన్నిన పన్నాగమే నోట్ల రద్దు చర్యగా ఆయన అభివర్ణించారు. పెట్టుబడి దారుల రహస్య ఎజెండాను కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అమలు పరుస్తుంది అనడానికి ఇదొక చక్కటి ఉదాహరణ గా ఆయన చెప్పుకొచ్చారు. అసలు 2,000 నోట్లను ఎందుకు తెచ్చారో… ఎందుకు రద్దు చేశారో అన్నది దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపయోగం లేదనుకున్నప్పుడు ఎందుకు తొలిసుకొచ్చారు అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయని ఆయన అన్నారు. ఏమి ఆశించి ఈ చర్యకు ఉపాక్రమించారు అని సర్వత్రా వెలువడుతున్న అనుమానలను నివృత్తి చెయ్యాల్సిన బాధ్యత మోడీ సర్కార్ పై ఉందన్నారు. నోట్ల రద్దు వెనుక ఉన్న బీజేపీ రహస్య ఎజెండాను బహిర్గతం చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. నోట్ల రద్దుతో ప్రయోజనం ఉందని భావిస్తే బహిరంగ పరచడానికి ఉన్న ఇబ్బంది ఏమిటో తేల్చి చెప్పాలన్నారు. ఆర్. బి. ఐ ని ముందు పెట్టి ప్రజల కళ్ళు గప్పే ప్రయత్నం తప్ప మరోటి కాదని ఆయన మోడీ సర్కార్ పై మండిపడ్డారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం పతనావస్థకు చేరుకుందని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు.