mt_logo

ఇది కానుక కాదు.. ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడమే.. : ఎమ్మెల్సీ కవిత

  • ఇది కానుక కాదు… జేబులను గుల్ల చేసి దగా చేయడం
  • సామాన్య ప్రజల జేబులను గుల్ల చేసి దగా చేయడమే.. 
  • ఎల్పీజీ సిలిండర్ ధరల పై కల్వకుంట్ల  ఎమ్మెల్సీ కవిత ట్వీట్ 

వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి నామమాత్రంగా తగ్గించి ఎంతో లబ్ధి చేశామని కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. వంట గ్యాస్ సిలిండర్ ధరల తగ్గింపు పై కల్వకుంట్ల కవిత ట్విట్టర్లో స్పందించారు. గత పది ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం ఒక ఎల్పీజీ  సిలిండర్ పై రూ. 800 పెంచి తాజాగా కేవలం రూ. 200 మాత్రమే తగ్గించిందని పేర్కొన్నారు. “ఇది కానుక కాదు. సామాన్య ప్రజల జేబులను గుల్ల చేసి దగా చేయడమే. ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడమే” అని ఘాటుగా స్పందించారు.