mt_logo

గత పాలకుల వల్లే రైతు ఆత్మహత్యలు- కర్నె ప్రభాకర్

గత ప్రభుత్వాలు ప్రాజెక్టులు పూర్తిచేయకపోవడం వల్లే వర్షాభావ పరిస్థితుల సమయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రైతు ఆత్మహత్యల పాపం గత పాలకులదేనని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతుల కోసం రూ. 17 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని, గతంలో ఏ ప్రభుత్వం చేయనివిధంగా రూ. 450 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని అందించామని గుర్తుచేశారు.

మిషన్ కాకతీయ కింద 9,600 చెరువులను తవ్వించామని, రూ. 900 కోట్లతో స్పింకర్లు, పాలీ హౌజ్ ల ఏర్పాటు కోసం రైతులకు సబ్సిడీని అందిస్తున్నామని ప్రభాకర్ చెప్పారు. ఉనికికోసమే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, వచ్చే ఏడాది నుండి వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్ అందిస్తామని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *