mt_logo

బ్రిటీషర్లు మొదలు పెట్టింది‌‌ .. బీజేపీ ఫాలో అవుతుంది : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

తెలంగాణ రాష్ట్ర శాసన మండలి లో  గిరిజన సంక్షేమం పై లఘు చర్చలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడారు. మణిపూర్ లో రెండు గిరిజన తెగల మధ్య కొట్లాట పెట్టించి చలి కాచుకుంటున్నారని బీజేపీపై మండిపడ్డారు. మణిపూర్ అల్లర్లను కట్టడి చేయడంలో కేంద్రం విఫలం అయ్యింది. విభజించి పాలించి ఓట్లు దండుకోవాలని బీజేపీ చూస్తోందన్నారు. బ్రిటీషర్లు మెదలు పెట్టింది‌‌ .. బీజేపీ ఫాలో అవుతుంది. కళ్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌, ఆరోగ్యలక్ష్మి పథకాలతో గిరిజన ఆడబిడ్డలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. 

4 లక్షల 5వేల ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీ చేసాము. లక్షా యాభై వేల మంది గిరిజనులకు పోడు పట్టాలు ద్వారా లబ్ధి పొందారు. ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి.. కేసీఆర్ సర్కార్ నినాదమని తెలిపారు. గిరిజనులకు రూ.1336 కోట్లు కళ్యాణలక్ష్మి కోసం నిధులను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఎస్టీలకు కేటాయించిన నిధులు ఎస్టీలకే ఖర్చు చేయటానికి కేసీఆర్ 2017లో ప్రత్యేక చట్టం తీసుకొచ్చారని గుర్తు చేసారు. ఆదివాసీ భవన్‌తో పాటు.. కొమురం భీం పేరుతో జోడే ఘాట్‌ను అభివృద్ధి చేసుకున్నామన్నారు. రూ.22 కోట్లతో హైదరాబాద్‌లో సేవాలాల్ బంజారా భవన్ నిర్మించుకున్నాము. తెలంగాణకు ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులు కేంద్రం ఇవ్వటం లేదని దుయ్యబట్టారు.